చారిత్రక గ్రంధాలు చదువుతున్న బాలకృష్ణ

తండ్రి ఎన్టీఆర్ లానే నందమూరి బాలకృష్ణ కూడా క్రమశిక్షణ, అంకితభావం వున్న నటుడు.ప్రతి సినిమాను ఒక యజ్ఞంలా భావించి చేస్తారాయన.

 Balakrishna Busy With Gowthami Putra Satkarni-TeluguStop.com

ఏ క్యారెక్టర్ పోషించినా ఎంతో కసరత్తు చేస్తారు

ప్రస్తుతం చేస్తున్న చారిత్రాత్మక కథా చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా విషయంలో అయితే, ఆయన మరిన్ని జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకుంటున్నారు.తెలుగు నేలను పాలించిన చక్రవర్తి కథ కావడంతో బాలయ్య తన గెటప్ నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు

శాతకర్ణి గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ప్రస్తుతం ఆయన అందుకు సంబంధించిన పలు చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేస్తున్నారట.

ప్రస్తుతం ఏమాత్రం సమయం చిక్కినా బాలయ్య ఆ పుస్తకాల పరిశీలనలోనే నిమగ్నమైపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.కాగా, భారీ బడ్జెట్టుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube