Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బాలకృష్ణ తేడా అంట-Balakrishna As “Theda Singh” ?

మీరే గనుక బాలకృష్ణ ఫ్యాన్ అయితే వెంటనే బూతుల పురాణం మొదలుపెట్టకండి. ఆయన్ని కించపరిచే ప్రయత్నం అస్సలు జరగట్లేదు ఇక్కడ. విషయం ఏమిటంటే, బాలకృష్ణ – పూరిజగన్నాథ్ సినిమాకి కొంచెం తేడాగా ఉన్న టైటిల్ పెట్టేలా ఉన్నారు. పూరి జగన్నాథ్ సినిమాలకి విచిత్రమైన టైటిల్స్ ఉంటాయని మనకు తెలిసిందే. పోకిరి, లోఫర్, ఇడియట్, రోగ్ .. ఇలా తిట్లను కూడా సినిమా టైటిల్స్ గా పెట్టుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి “తేడా సింగ్” అనే టైటిల్ ని రిజిస్టరు చేయించారట.

ఇదొక్కటే కాదులేండి, ఉస్తాద్, జై బాలయ్య, మామా ఎక్ పెగ్ లగావో అనే మరో మూడు టైటిల్స్ కి కూడా రిజిస్టరు చేయించారు. ఈ మూడు బాగున్నాయి కాని ఆ “తేడా సింగ్” అనే టైటిల్ కొంచెం తేడాగా ఉంది. జోకులు వేయడానికి యాంటి ఫ్యాన్స్ కి సరుకు ఇచ్చినట్లుగా ఉంది.

ఈ టైటిల్ గనుక ఫిక్స్ చేస్తే బాలయ్య అభిమానులు భారి ఎత్తున గొడవలు చేయడం ఖాయం. ఎట్టి పరిస్థితులలోనూ ఇలాంటి టైటిల్ ని బాలకృష్ణ మాస్ గణం ఆహ్వానించేలా లేరు. మరి పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోని అందరికి నచ్చే టైటిల్ ని ఖరారు చేస్తారని ఆశిద్దాం. ఇక ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబరు 29న విడుదల కానున్నట్లు సమాచారం.

Continue Reading
More Posts
To Top