శాతవాహన చక్రవర్తి చరిత్ర ఆధారంగా తన వందవ సినిమా తెలుగు జాతికి అంకితం చేస్తూ గౌతమిపుత్ర శాతకర్ణిగా వస్తున్న బాలకృష్ణ ఈరోజు ఫ్యాన్స్ కు ఆ సినిమాలోని ఫస్ట్ లుక్ టీజర్ తో అందరిని అవాక్కయ్యేలా చేశాడు.సింహంలా గర్జిస్తూ బాలయ్య లుక్ సూపర్బ్.
క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది.టీజర్ అయితే అంచనాలను అందుకుంది.
ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
బాలకృష్ణ ఎంతో కష్టపడి చేస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్.
శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కాదు టీజర్ తో కూడా కేక పెట్టించిన క్రిష్ సినిమాతో ఎలాంటి అనుభూతిని పొందేలా చేస్తాడో చూడాలి.
అన్ని హంగులను పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నరు మేకర్స్.వై.రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పొంగల్ దాకా వెయిట్ చేయాల్సిందే.
గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
.