టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమాను జక్కన్న దాదాపు రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమాను మొదటగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే షూటింగ్ కొంత ఆలస్యం అవ్వడంతో మే 15న విడుదల చేయబోతున్నట్లుగా స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.
అయితే ఒక్క నెల రోజులు మాత్రమే కదా ఆలస్యం అని అంతా అనుకున్నారు.అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా మేలో కూడా విడుదల అయ్యేది కష్టంగా ఉంది.
ఈ సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తి అయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఇంకా బ్యాలన్స్‌గా ఉన్నాయి.దాంతో ప్రస్తుతం రోజులో 24 గంటలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తున్నా కూడా మరో రెండు నెలల్లో పూర్తి అవ్వడం కష్టం అని అంటున్నారు.
అందుకే ఈ సినిమా మేలో కూడా విడుదల అయ్యేది కష్టంగా ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా కూడా విడుదల అనేక సార్లు వాయిదాలు పడి అనుకున్న సమయం కన్నా దాదాపు నాలుగు నెలలు ఆలస్యంగా విడుదల అయ్యింది.
మరి ఈ ‘బాహుబలి’ సినిమా కూడా ‘ఈగ’ సినిమాలా వాయిదా పర్వం కొనసాగిస్తుందేమో చూడాలి.