భారత దేశం సినీ ప్రేక్షక జగత్తు మొత్తం ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ‘బాహుబలి’ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.ఇది ఒక తెలుగు సినిమా అయినా కూడా దీన్ని జక్కన్న రాజమౌళి ఒక హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాడు.
దానికి తోడు ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తున్నాడు.దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది, చేస్తూనే ఉంది, సినిమా విడుదల తర్వాత మరెన్నో రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయి.తాజాగా ఆడియో రైట్స్ విషయంలో ‘బాహుబలి’ రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఆడియో రైట్స్ అయినా కూడా కోటి, ఆపై మించలేదు.అయితే ‘బాహుబలి’ మాత్రం ఏకంగా 2.25 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా తెలుగు మరియు తమిళం ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ లహరి సొంతం చేసుకుంది.
ఆడియో రైట్స్‌తో పాటు అన్ని ఏరియాల్లో కూడా పంపిణీ రైట్స్ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.జక్కన్న ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నాడు.
మొదటి పార్ట్ జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొదటి పార్ట్‌లో 8 పాటలున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.