Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

Baahubali 2 Movie Review

చిత్రం : బాహుబలి 2 – ది కంక్లూజన్

బ్యానర్ : అర్కా మీడియా

దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి

నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి

విడుదల తేది : ఏప్రిల్ 28, 2017

నటీనటులు – ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తదితరులు

200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని కొట్టలేక నానా తంటాలు పడుతున్న తెలుగు సినిమాని 600 కోట్ల మైలురాయిని దాటించిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళిది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జండాను ఎగురవేసిన జక్కన్న, ఇప్పుడు బాహుబలి రెండొవ భాగంతో 1000 కోట్ల క్లబ్ కి రిబ్బన్ కట్టింగ్ చేయనున్నారు. మరి బాహుబలి మొదటిభాగంతో హాలివుడ్ స్థాయి సినిమా చూపించిన రాజమౌళి, బాహుబలి 2 తో అంచనాలను అందుకున్నారా లేదా రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

కాలకేయులతో జరిగిన యుద్ధంలో శతృ సంహారంతో పాటు ప్రజల్ని రక్షించిన అమరేంద్ర బాహుబలి మాహీశ్మతి రాజుగా నియమించబడతాడని ప్రకటిస్తుంది రాజమాత శివగామి. దేశ పర్యాటనకి వెళ్ళిన బాహుబలి కుంతల రాజ్య రాణి దేవసేనని చూసి ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భల్లాలదేవుడు దేవసేనని కాంక్షిస్తాడు. తనని సొంతం చేసుకునేందుకు కుయక్తులు పన్నుతాడు. కాని విఫలయత్నాలు చేసిన భల్లాల తండ్రి బిజ్జలదేవుడి అండతో మాహిశ్మతి కీరీటాన్ని దక్కించుకుంటాడు. ఈ కథలో కుమార వర్మ ఎవరు? దేవసేన – బాహుబలి ప్రేమకథలో అతని పాత్ర ఏమిటి ? దేవసేన ప్రేమని పొందలేకపోయిన భల్లాలుడు ఏం చేసాడు? బాహుబలి రాజుగా నియమించారా లేదా? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నిజానిజాలు తెలుసుకున్న శివుడు భల్లాలుడిపై పగ ఎలా తీర్చుకున్నాడు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కరెక్టు కాదు .. మీరే తెలుసుకోవాలి.

నటీనటుల నటన :

బాహుబలి మొదటిభాగంలో చాలామంది వ్యక్తపరిచిన అభిప్రాయం ఏమిటంటే, ప్రభాస్ రానాలని ఇటు రమ్యకృష్ణ, అటు సత్యరాజ్ తమ అభినయంతో డామినేట్ చేసారని. కాని ఈసారి అలాంటి అవకాశం ఇవ్వలేదు ప్రభాస్. మొదటిభాగంలో అమరేంద్ర బాహుబలి యుద్ధవిద్యలని మాత్రమే చూడగలిగాం. కాని రెండోవ భాగంలో అతనిలోని భావోద్వేగాలు కనబడతాయి. ఆ ఎమోషన్స్ ని గొప్పగా పండించాడు ప్రభాస్. కటప్ప బాహుబలిని చంపే సీన్ లో ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ చెబుతాయి ప్రభాస్ ఎంత మంచి నటుడో. డార్లింగ్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఎటువంటి అనుమానం లేకుండా చెప్పవచ్చు.

Continue Reading

Trending…

To Top