మగవారు పిల్లల్ని కనే శక్తి తగ్గడానికి అది కూడా కారణం

పిల్లల్ని కనే శక్తి తగ్గడం, లేక వ్యంధ్యత్వం అనేది ఏళ్ళుగా పురుషులు ఎదుర్కొంటున్న సమస్య.ఈ సమస్యకి కారణం, వీర్యకణాల సంఖ్య తగ్గడం లేదా వీర్యకణాలు ఈదలేకపోవడం.

 Bad Sleep Pattern Will Damage Sperm Health – Study-TeluguStop.com

ఈ ప్రాబ్లమ్ కి కారణాలు ఎన్నో ఉండొచ్చు.ఆరోగ్యకరమైన డైట్ పాటించలేకపోవడం కావచ్చు, జన్యుపరమైన సమస్యలు కావచ్చు లేదా హార్మోను సమస్యలు కావచ్చు.

కాని ఇవిమాత్రమే కాదు, మనం ఊహించని ఓ రోజువారి సమస్య కూడా వ్యంధ్యత్వానికి, లేదంటే సంతానలేమికి కారణమవుతుంది.అదే నిద్రలేమి.

తగిన నిద్ర అందని పురుషుడి శరీరంలో వీర్యకణాలు తగ్గడం, బలహీనపడటం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

కొన్నేళ్ల క్రితం డెన్మార్క్ లో జరిగిన ఓ సదస్సులో నిద్రలేమి – విర్యకణాల మధ్య సంబంధం మీద చర్చించారు శాస్త్రవేత్తలు.

అదే సమయంలో వారు చేపట్టిన ఓ రీసెర్చిలో నిద్రలేమి వీర్యకణాలపై ఉత్పత్తి చూపుతుందని నిరూపితమైంది.నిద్రలేమి సమస్య ఉన్నవారిలో వీర్యం నాణ్యత ఏకంగా 25% తగ్గుతుందని, అలాగే 1.6 పాయింట్లు తక్కువ పరిపక్వ వీర్య కణం ఉంటుందని తేలింది. అలాగని నిద్ర ఎక్కువసేపు పోతే వీర్యం బలపడుతుందేమో అని అపోహపడేరూ! అతినిద్ర కూడా వీర్యకణాల సంఖ్య 25%-40% తగ్గిస్తుందని బోస్టన్ లో జరిగిన మరో అధ్యాయనంలో తేలింది.

కాబట్టి, ఇటు నిద్రలేమి, అటు అతినిద్ర .రెండూ పురుషుడి వీర్యానికి మంచివి కావు.

ఇలా జరగడానికి కారణం లైఫ్ స్టయిల్ దెబ్బతినడమే అంటున్నారు పరిశోధకులు.ఇక్కడ లైఫ్ స్టయిల్ దెబ్బతినడం అంటే ఆరోగ్యకరమైన నిద్ర అలవాటు లేకపోవడం.దీనివలనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలై, అది టెస్టోస్టిరోన్ లెవెల్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.నిద్రలేక స్ట్రెస్ మొదలై, కండీషన్ మరింతగా అదుపు తప్పుతుంది.

అప్పుడే వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల శక్తి రెండు తగ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube