బాబు బంగారం రివ్యూ

చిత్రం : బాబు బంగారం

 Babu Bangaram Movie Review-TeluguStop.com

బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

దర్శకత్వం : మారుతి

నిర్మాత : నాగవంశీ, పి.వి.

డి ప్రసాద్

సంగీతం : ఘిబ్రాన్

విడుదల తేది : ఆగష్టు 12, 2016

నటీనటులు : విక్టరి వెంకటేష్, నయనతార, సంపత్ రాజ్ తదితరులు

విక్టరి వెంకటేష్ గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు కురిపించినా, వెంకటేష్ తన స్టైల్లో ఒక ఎంటర్‌టైనర్ చేసి చాలా కాలమైంది.ఇక దర్శకుడు మారుతి భలే భలే మొగాడివోయ్ చిత్రంతో తన మీద ఉన్న “బూతు దర్శకుడు” ముద్ర చెరిపేసుకోని మంచి ఫామ్ లో ఉన్నారు.

ఇద్దరూ కామెడికి పెట్టింది పేరు.మరి వీరి కాంబినేషన్లో వచ్చిన బాబు బంగారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళ్తే …

ఏసిపి కృష్ణ (వెంకటేష్) ది చాలా సున్నితమైన మనస్తత్వం.జాలి గుణం అవసరానికి మించి ఉండటం ఈయన స్పెషాలిటి.

కష్టపడి పని చేస్తూ, ఒక మెస్ నడుపుతున్న నయనతారని చూసి ప్రేమలో పడిపోతాడు మన ఏసిపి.అయితే, తాను ప్రేమించిన అమ్మాయి తండ్రి పెద్ద ప్రమాదంలో ఉన్నాడని, తండ్రి మీద కేసు వలన తన ప్రేయసి కూడా ఎలాంటి కష్టాలతో సతమతమవుతోందో తెలుసుకున్న కృష్ణ, దీనికి కారణమైన మల్లేష్ యాదవ్ (సంపత్ రాజ్), ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణమురళి) ఆట ఎలా కట్టించాడు.

కేసు ఎలా డీల్ చేసాడు అనేది మిగితా కథ.

నటీనటుల నటన గురించి

“బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్” అని ప్రచారం చేసినట్టు, నిజంగానే ఆ మాస్ మసాలా వెంకి ఈజ్ బ్యాక్.వెంకటేష్ తనకు మాత్రమే సాధ్యమయ్యే కామెడి టైమింగ్ తో, స్టయిల్ తో అదరగొట్టాడు.అలాగే యాక్షన్ ఎపిసోడ్లలో వెంకి చూపించే ఆటిట్యూడ్ ఈ సినిమాలో పెద్ద హైలైట్.

నయనతార చాలా అందంగా కనిపించింది.తాను ఎక్కవగా చేసే తమిళ సినిమాల క్యారక్టర్స్ లో ఒకటి కాదు కాని, ఫర్వాలేదు అనిపించింది.

వెంకటేష్ – నయనతార కెమిస్ట్రీ ఎంత బాగుంటుంది మనం ఇప్పటివరకే చూసాం.

కామెడియన్ బ్యాచ్ ఓకే.ఎప్పటిలాగే పృథ్వీరాజ్ బాగా నవ్వించాడు.పృథ్వీ పోషించిన “బత్తాయి బాబ్జి” పాత్ర ఈ సినిమాకి వెంకటేష్ తరువాత మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

సినిమాలో బ్రహ్మబందం ఉన్నా, పృథ్వీ గురించే ఎక్కువ చెప్పుకోవాల్సిన రోజులు వచ్చేసాయి.ఇక పోసాని, సంపత్ రాజ్ షరామామూలే.

సాంకేతికవర్గం పనితీరు

కెమేరా వర్క్ చాలా బాగుంది.ఎడిటింగ్ గురించి కమర్షియల్ సినిమాల్లో లోతుగా మాట్లాడుకోవాల్సిన పని లేదు.

ఎందుకంటే చాలావరకు తప్పులు తెలిసే చేస్తారు.నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

సంగీతం ఇప్పటికే జనాల్లోకి ఎక్కేసింది.ఇక ఘిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

ఇటువైపు నుంచి ఎవరినైనా నిందించాల్సి వస్తే .అది మారుతినే.

ఆసక్తికరిమైన కథ కాని, కథనం కాని సినిమాలో లేవు.చాలావరకూ కామెడి కోసం తీసిన సన్నివేశాలు నవ్వించలేదు అంటే .మారుతి కాసేపు అలోచించుకోవాల్సిందే.

విశ్లేషణ

భలే భలే మొగాడివోయ్ అద్యంతం హీరో క్యారెక్టరైజేషన్, బిహేవియర్ మీదే నడుస్తూ ఉంటుంది.

క్యారెక్టర్ ఎక్కడా డైవర్ట్ అవదు కాబట్టే ప్రేక్షకుడు ఎక్కడా సినిమాలోంచి బయటకి వెళ్లలేదు.కాని బాబు బంగారంలో ఆ హానెస్టి కనబడదు.నానితో సినిమాకి వెంకటేష్ తో సినిమాకి అదే తేడా.ఈసారి కమర్షియల్ ఫార్ములాకి మారుతి తలవంచక తప్పలేదు.

చాలా సన్నివేశాలు నవ్వించడానికి విఫలయత్నాలయ చేస్తాయి.కాని మాస్ ప్రేక్షకులకి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్, మసాలా అక్కడక్కడ దొరుకుతూనే ఉంటుంది.

మొత్తం మీద బాబు బంగారం ఫర్వాలేదు అనిపిస్తుంది.

చాలాకాలంగా వెంకటేష్ ని తన స్టయిల్లో మిస్ అవుతున్నవారికి, పెద్ద హీరో నవ్వించి చాలాకాలమైంది అని అనుకునేవారికి, బోర్ కొట్టి అలా టైమ్ పాస్ చేద్దాం అనుకునేవారికి బాబు బంగారం ఫర్వాలేదు అనిపిస్తుంది.

నచ్చుతుంది అనేది కొంచెం దూరపు మాటే.

హైలైట్స్ :

* వెంకటేష్

* పృథ్వీ

* కొన్ని కామెడి సన్నివేశాలు,

* మాస్ ప్రేక్షకులని మెప్పించే అంశాలు

డ్రాబ్యాక్స్ :

* కథ

* స్క్రీన్ ప్లే

* నవ్వు పుట్టించని కొన్ని కామేడి సన్నివేశాలు

చివరగా :

వెంకటేష్ కోసం .అలా టైమ్ పాస్ కి

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube