Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బాబు బాగా బిజీ మూవీ రివ్యూ -Babu Baga Busy Review Babu Baga Busy,Babu Baga Busy Review,Mishty,Sreemukhi,Tejaswi Madiwada

చిత్రం : బాబు బాగా బిజీ

బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్

దర్శకత్వం : నవీన్ మేడారం

నిర్మాత : అభిషేక్ నామా

సంగీతం : సునీల్ కశ్యప్

విడుదల తేది : మే 5, 2017

నటీనటులు – శ్రీనివాస్ అవసరాల, శ్రీముఖి, తేజస్వి మడివాడ, మిష్తి చక్రవర్తి, సుప్రియ ఐసోలా, ప్రియదర్శి తదితరులు

ఇప్పుడు దర్శకుడిగా రాణిస్తున్న శ్రీనివాస్ అవసరాల తన కెరీర్ ని మొదలుపెట్టింది మాత్రం నటుడిగానే. తోలి సినిమా అష్టచెమ్మతో బంపర్ సక్సెస్ అందుకున్న శ్రీనివాస్, ఆ తరువాత ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. అయితే పూర్తిగా క్లాస్ ఇమేజ్ ఉన్న శ్రీనివాస్ అవసరాల “బాబు బాగా బిజీ” లాంటి బోల్డ్ సబ్జెక్ట్ ని ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ అడల్ట్ కామెడి ఎంతవరకు వర్కవుట్ అయ్యిందో చూద్దాం.

కథలోకి వెళితే :

మాధవ్ (శ్రీనివాస్ అవసరాల) చిన్ననాటి నుంచే ఓ సెక్స్ అడిక్ట్. అమ్మాయిలను పడేయటమే గోల్ గా పెట్టుకున్న ఇతని జీవితంలోకి వివిధ దశల్లోకి పారు (తేజస్వి), చంద్రిక (సుప్రియ ఐసోలా), శోభ (శ్రీముఖి), రాధ (మిష్తి) వస్తారు. ఎవరి రాక వలన మాధవ్ లో కామానికి బదులు ప్రేమ పుట్టింది ? గతమంతా సెక్స్ తప్ప ప్రేమ లేని మాధవ్ జీవితాన్ని, మాధవ్ ని ఎవరు ప్రేమించారు ? ఈ ప్రశ్నలకు సమాధానం వెండితెర మీదే తెలుసుకోండి.

నటీనటుల నటన :

మనం చూడని శ్రీనివాస్ అవసరాలని ఇందులో చూస్తున్నా, ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించదు. ఎదో పక్కింటి అబ్బాయిలా ఉండే వాక్చాతుర్యం, టైమింగ్ తో ఈ సెక్స్ అడిక్ట్ పాత్రని కూడా పర్ఫెక్ట్ గా పండించారు అవసరాల. ఫ్లాష్ బ్యాక్ లో కన్నా, ప్రస్తుతం నడుస్తున్న కథలో అవసరాల నటన ఇంకా బాగుంది. మిష్తి ఈ సినిమాకు ఓ మైనస్. అసలు ఈ పాత్రను శ్రీముఖితో చేయించి ఉంటే ఇంకా బాగుండేదేమో. మొత్తానికి ఓ కీలకమైన క్యారక్టర్ లో ఈ బెంగాలి భామ పూర్తిగా తేలిపోయింది. శ్రీముఖి ఉన్నంతసేపు ఫర్వాలేదు అనిపించింది. ముందు చెప్పిన్నట్టుగా, మిస్తికి ఇచ్చిన పాత్ర శ్రీముఖికి ఇవ్వాల్సింది. తేజస్వి కొత్తగా, బాగుంది. కాని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే హీరోయిన్లు వీరు ముగ్గురు కాదు. ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ దృష్టిని ఆకర్షించేది సుప్రియ ఐసోలా. హంటర్ లోని హాట్ సీన్ ని అలాగే దింపేశారు. 30 ఏళ్ల అంటి పాత్రలో కరెక్టుగా సరిపోయింది ఈ తెలుగమ్మాయి. ఇంత బోల్డ్ గా ఆ పాత్రను చేయడం ధైర్యమే అని చెప్పాలి. మిగితా పాత్రల్లో ప్రియదర్శి ఒకే.

Continue Reading
To Top