వహ్వా : అక్కడి వరకూ వెళ్ళిన బాహుబలి

‘ఏషియన్ సినిమా అవార్డ్స్’.ఆసియా దేశాల్లోని సినీ పరిశ్రమలకు ఆస్కార్‌గా చెప్పబడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అవార్డులు.

 Baahubali Nominated In Asain Film Awards For Best Vfx-TeluguStop.com

‘ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ అకాడమీ’ సంస్థ గత పదేళ్ళుగా ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది.తాజాగా 10వ సంవత్సరం నిర్వహించే అవార్డుల వేడుక కోసం మొత్తం ఆసియాలోని తొమ్మిది దేశాల్లోని సినీ పరిశ్రమల నుంచి నామినేషన్స్ ప్రకటించింది.

పదిహేను క్యాటగిరీల్లో అవార్డులకు గానూ మొత్తం ఒక్కొ క్యాటగిరీకి మూడు సినిమాలను చొప్పున నామినేషన్స్ ప్రకటించారు.ఇక ఈ నామినేషన్స్‌లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో ‘బాహుబలి’ సినిమాకు గానూ శ్రీనివాస్ మోహన్ పోటీపడుతున్నారు.

‘బాహుబలి’ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించడంలో ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌కూడా ప్రధాన పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ భాగంలో సినిమాకు ఏషియన్ అవార్డ్స్‌నామినేషన్స్‌లో బాహుబలి నిలవడం టీమ్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

మార్చి 17న మకావులోని ఓ లగ్జరీ హోటల్లో జరిగే వేడుకలో విజేతను ప్రకటిస్తారు.ఏషియన్ అవార్డ్స్‌లో తనకు నామినేషన్ దక్కడం పట్ల శ్రీనివాస్ మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

బాహుబలి టీమ్ ప్రోద్భలం వల్లే ఈ స్థాయి ఔట్‌పుట్ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube