కనీవిని ఎరుగని రీతిలో ‘బాహుబలి’ కలెక్షన్స్ భారీగా వస్తూనే ఉన్నాయి.మొదటి వారం మాత్రమే కాకుండా రెండవ వారంలో సైతం ‘బాహుబలి’ భారీ కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది.
రెండవ వారంలో మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో ‘బాహుబలి’ కలెక్షన్స్ దుమ్ము లేచిపోతుంది.తెలుగు సినిమా 100 కోట్లు ఎప్పుడెప్పుడు సాధిస్తుందా అని ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకు గర్వించేలా ఈ సినిమా ఏకంగా 300 కోట్లను వసూళ్లు చేయగలిగింది.
ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్‌టైం రికార్డు సూపర్ స్టార్ నటించిన ‘రోబో’ సినిమా పేరిట ఉంది.290 కోట్లు వసూళ్లు చేసిన ‘రోబో’ను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా క్రాస్ చేయలేక పోయింది.బలమైన ‘రోబో’ రికార్డును కేవం 9 రోజుల్లోనే ‘బాహుబలి’ క్రాస్ చేసి తన స్టామినాను చూపించాడు.తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో భారీగా విడుదలైన ‘బాహుబలి’ సినిమా ఓవర్సీస్లో మాత్రం ‘రోబో’ రికార్డుకు కాస్త దూరంగా ఉంది.
బాలీవుడ్లో ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను దాటింది.ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో బాలీవుడ్లో కలెక్ట్ చేయడం ఇదే ప్రథమం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇప్పటికి కూడా ‘బాహుబలి’కి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.మొత్తంగా మరో 100 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ట్రేడ్ పండితులు అంటున్నారు.