బాహుబలి అందరి కొంపలు ముంచుతోంది

బాహుబలి సీరీస్ తెలుగు సినిమాకి ఎంత మేలు చేసిందో, ఇప్పుడు బాలివుడ్ కి అంత కీడు చేస్తోంది.అసలే గత రెండు సంవత్సరాల్లో బాలివుడ్ ట్రాక్ రికార్డు బాగాలేదు.

 Baahubali Is Killing Bollywood – Opines Bollywood Critics-TeluguStop.com

ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరి మీదే మొత్తం మార్కెట్ ఆధారపడి ఉంది.ఈ ఇద్దరు వస్తే తప్ప హిందీ బాక్సాఫీస్ సందడి చేయడం లేదు.ఇక మరో ఖాన్ త్రయంలో ఒకప్పటి నెం.1 షారుఖ్ ఖాన్ పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా మారుతోంది.అక్షయ్ కుమార్ హిట్ కొట్టినా, అదేమీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు.హృతిక్ కూడా ఎప్పుడో చల్లబడ్డాడు ఇక మిగితా హీరోల సంగతి ఎందుకు.ఇలా కష్టకాలంలో ఉన్న బాలివుడ్ ఇండస్ట్రీని, దాని మీద ఆధారపడి బ్రతుకున్న పంపిణిదారులు, ముఖ్యంగా సింగల్ స్క్రీన్ థియేటర్ యజమానులను ఆదుకుంది బాహుబలి.ఆ సినిమా ఎంతలా నచ్చింది అంటే, ఇన్నిరోజులు బాలివుడ్ చప్పటి కూడు తింటున్నవారికి ఒక రుచికరమైన మాంసాహారం దొరికినంత పనైంది.దాంతో ఒక డబ్బింగ్ సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.500 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి, దంగల్ కలెక్షన్లను హిందీలో 120 కోట్ల తేడాతో ఓడించింది.

ఆ తరువాత హిందీ మీడియం అనే ఒకే ఒక్క హిట్ సినిమాను మినహాయిస్తే బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ సిన్మా లేదు.అసలు ఈ ఏడాది బాలివుడ్ లో వచ్చిన హిట్స్ ని ఒకే చేతిలోని వేళ్ళ మీద లెక్కపెడదామనన్నా కుదరట్లేదు.

అంటే పట్టుమని అయిదు కూడా లేవు అన్నమాట.

మొన్న సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచి, వంద కోట్లకు పైగా నష్టాలు తీసుకొస్తే, కొత్తగా వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా జబ్ హ్యారి మెట్ సజెల్ కనీసం థియేటర్లలో కరెంట్ ఖర్చులు కూడా రాబట్టడం లేదు.

జనాలు లేక షోలు క్యాన్సల్ అవుతున్నాయి.బాలివుడ్ లో ఈ దుస్థితికి కారణం బాహుబలి అంటున్నారు హిందీ క్రిటిక్స్.

ఆ సినిమా నుంచే బాలివుడ్ పై హిందీ జనాల్లోనే వ్యతిరేకత మొదలైంది అని, ఆమీర్ ఖాన్ ని మినహాయిస్తే ఎవరి సినిమాల కోసం కూడా హిందీ జనాలు ఎదురుచూడటం లేదు అని, ఇప్పుడు బాలివుడ్ లో గ్రాఫిక్స్, కథాబలం, యాక్షన్ బాగా ఉండే దక్షిణాది సినిమాలే కావాలని, సౌత్ లో బాహుబలి, స్పైడర్, సాహో, 2.0 లాంటి ఇంటర్నేషనల్ స్థాయి కథాచిత్రాలు వస్తోంటే, బాలివుడ్ ఇంకా ప్రేమకథల చుట్టూ తిరిగుతోంది, ఇలానే ఉంటే త్వరలోనే తెలుగు – తమిళ సినిమా దేశంలో అతిపెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీలుగా ఎదుగుతాయని అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube