బాలివుడ్ కి ప్రమాదమై కూర్చున్న బాహుబలి

బాహుబలి విడదలకి ముందు తెలుగులో సరిగా 150 గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమా లేదు.అలాంటిది దాదాపుగా 600 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని రాబట్టింది బాహుబలి.

 Baahubali Is A Threat To Bollywood – Karan Johar-TeluguStop.com

ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో మూడంటే మూడు సినిమాలు మాత్రమే ఆ ఫిగర్ దాకా వచ్చాయి.మొదటిది ఆమీర్ ఖాన్ పీకే, ఆ తరువాత సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ తోపాటు బహుబలి ఈ ఘనతను సాధించింది.

నిజంగా ఓ తెలుగు సినిమా అంత దూరం దాకా వెళుతుందని ఎవరు అనుకోలేదు.

ఇప్పుడు బాహుబలి రెండొవభాగానికి మామూలు క్రేజ్ లేదు.

ఈసారి 600 కోట్లు చిన్న టార్గెట్ లా కనిపిస్తోంది.కేవలం హిందీ వెర్షన్ ద్వారానే 200 కోట్ల నెట్ కలెక్షన్ ఈజీగా రాబడుతుందని అంచనా వేస్తున్నారు బాలివుడ్ విశ్లేషకులు.

ఇక హిందీ చిత్ర అగ్రనిర్మాత, బాహుబలి హిందీ వెర్షన్ సమర్పకుడు కరణ్ జోహర్ అయితే ఏకంగా బహుబలి బాలివుడ్ కి ప్రమాదమై కూర్చుంది అని వ్యాఖ్యానించాడు.

ఇటివలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “బాహుబలి ఏ పెద్ద హిందీ సినిమాకైనా ప్రమాదమే.

ఆ సినిమాతో పోటి పడాలని ఎవరు కోరుకోరు.భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా ఎదిగింది బాహుబలి.

రాజమౌళి గారు తన జీవితంలోని చాలా సమయాన్ని ఈ సినిమాపై వెచ్చించడం ద్వారానే ఇది సాధ్యపడింది.నాకు తెలిసి ఎవరు కూడా ఈ చిత్రం యొక్క రెండోభాగన్ని చూడకుండా ఉండలేరు.

మొదటిభాగం చూసి రాజమౌళిని కౌగిలించుకున్నప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద డైరెక్టర్లలందరిని మర్చిపోయి, ఈయన్ని మించినవాడు లేడు అని అనిపించింది.రెండొవభాగం ఎక్కడిదాకా అయినా వెళ్ళొచ్చు.

వెయ్యి కోట్లు వసూలు చేసినా చేయవచ్చు ” అంటూ బాహుబలి మీద, మన జక్కన్న మీద పొగడ్తల వర్షం కురిపించాడు కరణ్ జోహర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube