బాహుబలి - బ్రేకింగ్ న్యూస్

బాహుబలి అంతర్జాతీయ మార్కెట్ లోకి కాలు పెడుతోంది.తోలి ఫేజ్ లో భారతీయ భాషలు హిందీ,తెలుగు,తమిళం,మళయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు చైనా మార్కెట్ లోకి చైనీస్ భాషలో వెళ్లనుంది.

 Baahubali In China This May-TeluguStop.com

ఈ ప్రకటన చాలాకాలం క్రితమే చేసినా, విడుదల ఎప్పుడు అనేది ప్రకటించలేదు.అప్పుడు ఇప్పుడు అని ఊరించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మే నెలలో బాహుబలి-ది బిగినింగ్ ని చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.ఈ-స్టార్ ఫిలిమ్స్ అనే సంస్థ బాహుబలి చైనా హక్కులని కొనుక్కుంది.

పెట్టిన భారిమోత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు భారి రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు.దాదాపు 6,000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.

ఇది భారతీయ చిత్రాల్లో రికార్డు.చైనాలో 100 కోట్ల మార్కెట్ కలిగి ఉన్న ఆమీర్ ఖాన్ చిత్రాల కన్నా పెద్ద రిలీజ్.

మరి అక్కడ కూడా బాహుబలి అద్భుతాలు సృష్టిస్తుందా ? ఆమీర్ ఖాన్ పీకే 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది చైనాలో, ఆ రికార్డుని బద్దలు కొట్టేస్తుందా ? మన జక్కన్న పేరు చైనాలో కూడా మారుమ్రోగిపోతుండా ? అన్నిటికి సమాధానం మే నెల చెప్పేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube