బాహుబలి వాళ్ళే మహేష్ మీద కన్నేశారు

సూపర్ స్టార్ .మహేష్ బాబు.

 Baahubali Distributors For Spyder Hindi Version-TeluguStop.com

ఒక్క బాలివుడ్ సినిమా చేయలేదు.అయినా దేశవ్యాప్తంగా పాపులర్.

మోస్ట్ డిజైరబుల్ మెన్ పోల్ లో ఎప్పుడైతే టాప్ 10 లోకి ఎంటర్ అయ్యాడో, అప్పటినుంచి ఒక్కసారి కూడా టాప్ 10 నుంచి పడిపోలేదు.ఓసారి నెం.1 గా కూడా నిలిచాడు.బాలివుడ్ సినిమాలు చేయకుండానే కొన్ని బ్రాండ్స్ కి నేషనల్ వైడ్ అంబాసిడర్ గా చేసాడు.

అంత పాపులారిటి ఉంది కాబట్టే ఇవన్ని సాధ్యపడ్డాయి.అంత పాపులారిటి ఉంది కాబట్టే రెస్టాఫ్ ఇండియా కలెక్షన్లు ఎప్పుడూ మహేష్ కె ఎక్కువ ఉంటాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే స్పైడర్ హిందీలోకి భారి స్థాయిలో వేళ్ళబోతోంది.

స్పైడర్ హక్కులని ఎవరు తీసుకుంటున్నారో తెలుసా ? AA ఫిలిమ్స్.అవును బాహుబలి రెండు భాగాలను పంపిణి చేసి, ఇప్పుడు 2.0 హిందీ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్న అనిల్ తాండాని స్పైడర్ హక్కులని కూడా తీసుకుంటున్నాడటా.బాహుబలికి ఉన్నట్లు కరణ్ జోహార్ సపోర్ట్ లేకపోయినా, 2.0 లో అక్షయ్ కుమార్ ఉన్నట్లుగా బాలివుడ్ అగ్రనటుడు లేకపోయినా, స్పైడర్ రేటు భారీగానే పలికినట్లు సమాచారం.డీల్ ఫైనల్ అయిన తరువాత రేటు కూడా బయటకి తెలుస్తుంది.ఇలా పెద్ద మొత్తంలో డీల్ అవడానికి కారణం ఈ సినిమా మీద ఉన్న అంచనాలే.మహేష్ బాబు ఉత్తరాది ప్రేక్షకులకి తెల్సిన నటుడు అయితే, మురుగదాస్ హిందీలో గజినీ, హాలిడే లాంటి హిట్ సినిమాలు తీసాడు.ఇంతమాత్రమే కాదు, బాహుబలి తరువాత తెలుగు సినిమాలకి హిందీ బెల్ట్స్ లో డిమాండ్ బాగా పెరిగంది.

స్పైడర్ కూడా భారి సినిమా కాబట్టి బాగా ఆసక్తిగా ఉన్నారు హిందీ పంపిణిదారులు.

మరి స్పైడర్ కి బాహుబలిలా కారణం జోహార్ అండ ఉంటుందా ఉండదా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.

ఇప్పటివరకు ఫైనల్ అవలేదు కాని, కరణ్ జోహార్ కూడా స్పైడర్ మీద చాలా ఆసక్తిగా ఉన్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube