మరో రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి

అబ్బా ! ఈ బాహుబలి రికార్డుల గురించి చెప్పి చెప్పి బోర్ కొట్టేస్తోంది.ఒకటా రెండా , ఒక్క సినిమా ఇన్నేసి రికార్డులు కొట్టేస్తే ఎలా ! కొత్తగా మళ్ళి ఏం సాధించాడు మన రాజమౌళి అనే సస్పెన్స్ ఎక్కువసేపు ఉండకుండా వెంటనే చదివేయండి.

 Baahubali Crossed Rs 300 Crore Share Mark-TeluguStop.com

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయింది దాదాపు 160 కోట్లకు.దీన్నే ప్రీ-రిలీజ్ బిజినెస్ అంటారు.160 కోట్ల షేర్ కి ఒక్క పైసా తగ్గినా బాహుబలిని ఫ్లాప్ అనేవారు.అసలు 160 కోట్ల షేర్ ని మొదటి వారంలోనే దాటేసినా బాహుబలి ఇప్పుడు 300 కోట్ల షేర్ మార్కును కుడా దాటేసి 302 కోట్ల షేర్ వద్ద ఆగిపోయింది.

భారతీయ చలన చిత్ర చరిత్రలో 300 కోట్ల షేర్ దాటిన రెండో చిత్రం భాహుబలి.దాదాపు 320 కోట్ల షేర్ వసుళ్ళతో ఆమీర్ ఖాన్ పీకే ఇంకా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

బాహుబలి చైనాలో కుడా ప్రభంజనం సృష్టిస్తే పీకే కుడా ఓడిపోవచ్చు.

ఇక బాహుబలి గ్రాస్ 586 కోట్లు, 15 రోజుల క్రితం బాహుబలి 600 కోట్ల గ్రాస్ దాటింది అనేది ఆవాస్తావం.

కాని ఇంకో 14 కోట్లు చేసుంటే పీకే, బజరంగి భాయిజాన్ తరువాత 600 కోట్ల గ్రాస్ చేసిన మూడో చిత్రం భారతీయ చిత్రం అయ్యేది బాహుబలి.బజరంగి భాయిజాన్ గ్రాస్ బాహుబలి కన్నా ఎక్కువ అయినప్పుడు షేర్ కుడా ఎక్కువ రావాలిగా అని అనుమానపడుతున్నారా ? తెలుగు సినిమాలకు విధించే వినోదపు పన్ను హిందీ సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ.అందుకే 300 కోట్ల షేర్ మార్కుని అందుకోగలిగాడు మన రాజమౌళి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube