సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే సమయానికి మీరు ఏం చేస్తున్నారో ? దేని గురించి ఆలోచిస్తున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో ? మీకు గుర్తుందా ? ఖచ్చితంగా అందరి ఆన్సర్ బాహుబలి అయ్యే ఉంటుంది.ఎందుకంటే ఎపిక్ బాహుబలి విడుదల అయ్యి ఇవాల్టికి సరిగ్గా ఏడాది పూర్తి అయింది.
ఒక తెలుగు సినిమా ఇంతటి అద్భుతమైన విజయం సాధిస్తుంది అనీ ఈ రేంజ్ లో సినిమా అవుట్ పుట్ ఉంటుంది అనీ బాలీవుడ్ , హాలీవుడ్ టెక్నీషియన్ లని సైతం నివ్వెర పరుస్తుంది అని బహుసా ఎవ్వరూ ఊహించి ఉండరు.ప్రస్తుతం బాహుబలి సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.
2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ విడుదలై.ఎన్నెన్నో విజయాలను సాధించింది.
దశాబ్దాల పాటు థియేటర్ల మొహం చూడని వాళ్లను కూడా.సినిమా థియేటర్ వైపు నడిపించింది.
ఈ సందర్భంగా.బాహుబలి ది బిగినింగ్ కి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను బాహుబలి యూనిట్ విడుద చేసింది.
ఇందులో హీరో ప్రభాస్ నుంచి.విలన్ రానా.
హీరోయిన్స్ అనుష్క.తమన్నాలతోపాటు కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ పడ్డ కష్టం కూడా కనిపిస్తుంది.
నిమిషం పైగా నిడివి ఉన్న ఈ వీడియోని చూసిన తర్వాత.ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు.
ఈ సినిమాకి మేకింగ్ వీడియో విడుదల చేసారు రాజమౌళి .