ఉదయాన్నే తీసుకోకూడని ఆహారాలు ఇవి

కొన్ని గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, ఉదయాన్నే కడుపుకి పనిచేబుతాం కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ ని సరిగా ప్లాన్ చేసుకోవాలి.ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈపాటికే చెప్పేసాం.

 Avoid All These Foods Early In The Morning-TeluguStop.com

ఇప్పుడు ఉదయాన్నే, ఏమి తినకముందు, సాధారణ భాషలో చెప్పాలంటే పరికడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం.

* ఉదయాన్నే నూనె ఎక్కువగా వాడిన వస్తువులు తీసుకోకూడదు.

నూనె లో ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అది త్వరగా ఆకలి పెరగకుండా అడ్డుకుంటుంది.దాంతో లంచ్ టైం తప్పుతాం.

నూనె లేని వస్తువులు అల్పాహారంలోకి తీసుకోవడానికి ప్రయత్నించండి.

* స్పైసీ ఫుడ్స్ ఎప్పుడు తీసుకున్న పొట్టకి ఇబ్బందే.

మరీ ముఖ్యంగా ఉదయాన్నే స్పైసీ ఆహారం అస్సలు తీసుకోవద్దు.ఇది మీ పేగులను బాధపెడుతుంది.

* కొంతమంది ఉదయం లేవగానే మొదట చేసే పని కాఫీ తాగడం.కడుపులోకి ఏమి వెళ్లకముందు కాఫీ తాగడం అంత మంచిది కాదు.

ఎందుకంటే హైడ్రో క్లోరిక్ యాసిడ్ అప్పుడు డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతుంది.తద్వారా కడుపులో ఆసిడ్ రియాక్షన్స్ దెబ్బతింటాయి.

* అసలు ఏమి తినకుండా సాఫ్ట్ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు.ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెంచుకోవడం ఎందుకు.

అంతేకాకుండా ఇది స్టమక్ బ్లోటింగ్ కి కారణమవుతుంది.

* ఉదయాన్నే బీన్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెం వస్తుంది.

అలాగే ఆల్కొహాల్ ప్రాడక్ట్స్ తో బ్లోటింగ్ తప్పదు.ఉదయాన్నే సిట్రస్ ఫలాలు, టమాట కూడా వద్దు.

ఇవి అల్సర్స్ ని మోసుకోస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube