నటుడిగా ఓ ప్రత్యేకమైన స్టైల్ తో సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.నటుడిగా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీయాలనే తాపత్రయ పడతాడు రవిబాబు.
రెండు మూడు సంవత్సరాల గ్యాప్ తో సినిమా తీసి యూత్ ను ఎట్రాక్ట్ చేస్తాడు రవిబాబు.ప్రస్తుతం రాజమౌళి ఈగకు పోటీగా పందితో అదుగో సినిమా చేస్తున్న రవిబాబు ఇప్పుడు ఓ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
రీసెంట్ గా పెళ్లిచూపులు హిట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానున్నదట.ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు ముగిశాయని అంటున్నారు.
రవిబాబు దర్శకత్వం అనగానే కచ్చితంగా విజయ్ మళ్లీ ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నాడనే అనిపిస్తుంది.పెళ్లిచూపులు హిట్ తో దశ మారిపోయిన ఈ యువ హీరోతో సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇక రవిబాబు, విజయ్ ల సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.