రవిబాబుతో పెళ్లిచూపులు హీరో..! -Vijay Devarakonda Movie With Ravibabu 3 months

Pelli Choopulu Hero Ravibabu Vijay Devarakonda Movie With Ravibabu Vyjayanthi Photo,Image,Pics-

నటుడిగా ఓ ప్రత్యేకమైన స్టైల్ తో సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. నటుడిగా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీయాలనే తాపత్రయ పడతాడు రవిబాబు. రెండు మూడు సంవత్సరాల గ్యాప్ తో సినిమా తీసి యూత్ ను ఎట్రాక్ట్ చేస్తాడు రవిబాబు. ప్రస్తుతం రాజమౌళి ఈగకు పోటీగా పందితో అదుగో సినిమా చేస్తున్న రవిబాబు ఇప్పుడు ఓ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

రీసెంట్ గా పెళ్లిచూపులు హిట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానున్నదట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు ముగిశాయని అంటున్నారు. రవిబాబు దర్శకత్వం అనగానే కచ్చితంగా విజయ్ మళ్లీ ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నాడనే అనిపిస్తుంది. పెళ్లిచూపులు హిట్ తో దశ మారిపోయిన ఈ యువ హీరోతో సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక రవిబాబు, విజయ్ ల సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ గాలి తీసేసిన చిరంజీవి

About This Post..రవిబాబుతో పెళ్లిచూపులు హీరో..!

This Post provides detail information about రవిబాబుతో పెళ్లిచూపులు హీరో..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Vijay Devarakonda Movie With Ravibabu, Vijay Devarakonda, Ravibabu, Pelli Choopulu Hero, Vyjayanthi, Ashwinidutt

Tagged with:Vijay Devarakonda Movie With Ravibabu, Vijay Devarakonda, Ravibabu, Pelli Choopulu Hero, Vyjayanthi, AshwiniduttAshwinidutt,Pelli Choopulu Hero,ravibabu,Vijay Devarakonda,Vijay Devarakonda Movie With Ravibabu,vyjayanthi,,