ప్రత్యేకహోదా,ఇచ్చేది లేదు:అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు లేవు.అలాగే ప్రత్యెక నిధులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేది లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తెలియచేసారు కేంద్రసహాయ మంత్రి సుజనాచౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావులతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు ఇకమీదట ప్రత్యేక హోదా ఇవ్వరాదని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినందున ఆంధ్రకు హోదా ఇవ్వటం కుదరదని కుండబద్దలు కొట్టారు.

 Arun Jaitley On Andhra Pradesh Special Status-TeluguStop.com

ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని చట్టబద్ధంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అంతకుమించి ఏమి లేదని మరోసారి విషయాన్ని తేల్చేసారు .మార్చి నెలాఖరుకు ఆంధ్రకు కేంద్రం నుంచి పది వేల కోట్లు రూపాయలు అందుతాయని సుజనా చౌదరి చేసిన ప్రకటనను జైట్లీ దృష్టికి తీసుకురాగా, బదులీయకుండా ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి దశలవారీగా నిధులు ఇస్తోంది అని ముక్తసరిగా చెప్పారు .సుజనాచౌదరి చెప్పినదానికి మేమిచ్చే కేటాయింపులు గా భావించవచ్చని అరుణ్ జైట్లీ సుజన మాటలను వెనకేసుకొచ్చినట్లు తెలిపారు.రాష్ట్రానికి ఇంతవరకు కేంద్రం నుంచి అందిన మొత్తం ఎంత? అనే ప్రశ్నకు జైట్లీ మీరే లెక్కలు వేసుకోండి’ అంటూమీట్ లోంచి లేచి వెళ్లిపోయారు.పునర్విభజన చట్టంలో ఇటు ఆంధ్రకు, అటు తెలంగాణకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని జైట్లీ తెలుగు దేశం ఎంపీలకు భరోసా ఇచ్చినట్లు డిల్లి లో చెబుతున్నారు .రెండు తెలుగురాష్ట్రాల మధ్య రాజకీయంగా ఎలాంటి వివక్షా లేకుండా చూస్తామని కూడా జైట్లీ ఉండబోదన్నారు అని తెలిపారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube