పసిడి పూత నగలు భద్రపరచటం ఎలా?

ఈ రోజున చాలా మంది రకరకాల లోహాలతో తయారైన నగల మీద పసిడి పూత వేసిన వాటిని ధరిస్తున్నారు.వీటిని జాగ్రత్తగా భద్రపరిస్తే మెరుపు పోకుండా ఉంటుంది.

 Artificial Jewelry Cleaning Tips-TeluguStop.com

ఇప్పుడు ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

ఈ నగల్ని వెల్వెట్ వస్తంలో చుట్టి ఉంచితే గీతలు పడకుండా ఉంటాయి.

ఈ నగల్ని శుభ్రం చేయటానికి ఎటువంటి రసాయనాలను ఉపయోగించకూడదు.బాగా మరిగించిన నీటిలో దూదిని ముంచి తుడవాలి.

టమోటాలు తరుగుతున్న సమయంలో ఎటువంటి ఆభరణాలు చేతికి లేకుండా చూసుకోవాలి.ఎందుకంటే టమోటా లోని పులుపు నగలను నల్లగా మారుస్తుంది.

బిగుతుగా ఉండే పర్స్ లలో పెట్టకూడదు.అంతేకాక ఇతర నగలలో కలిపి పెట్టకూడదు.

పూత వేసిన నగలకు నూనె,నెయిల్ పాలిష్,రిమూవర్ వంటివి తగలకుండా చూసుకోవాలి.

ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో ఈ నగలను ధరించక పోవటమే మంచిది.

చెమట కారణంగా ఆ నగల రంగు మారే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube