మెగా, మురగదాస్‌ మూవీ అప్‌డేట్స్‌

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురగదాస్‌తో సినిమా చేయాలని మెగా హీరో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు ఉబలాట పడుతున్నారు.కొంత కాలం క్రితం రామ్‌చరణ్‌, మురగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

 Ar Murugadoss Plan To Do Movie With Mega Hero Allu Arjun-TeluguStop.com

అందుకు సాక్ష్యం అన్నట్లుగా వీరిద్దరు పలు సార్లు కలిశారు.అయితే కొన్ని రోజుల తర్వాత అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది.

వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ లేనట్లే అని తేలిపోయింది.తాజాగా మురగదాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా రాబోతుందనే టాక్‌ ప్రస్తుతం తమిళ మరియు తెలుగు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తమిళంతో పాటు, హిందీలో కూడా మంచి క్రేజ్‌ ఉన్న మురగదాస్‌ దాస్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో అల్లు అర్జున్‌ హ్యాపీగా ఉన్నాడు.త్వరలో చేయబోతున్న బోయపాటి శ్రీను సినిమా పూర్తి కాగానే మురగదాస్‌ సినిమాను బన్నీ మొదలు పెట్టే అవకాశాలున్నాయి.

అల్లు ఫ్యామిలీపై మురగదాస్‌కు ప్రత్యేక అభిమానం ఉంది.తన మొదటి బాలీవుడ్‌ సినిమా అల్లు అరవింద్‌ నిర్మించడమే ఆ ప్రత్యేక అభిమానంకు కారణం.

ఆ అభిమానంతో బన్నీ హీరోగా మురగదాస్‌ సినిమా చేయబోతున్నాడు.ఇప్పటికే మయాళంలో క్రేజీ హీరోగా పేరున్న అల్లు అర్జున్‌, ఈ సినిమాతో తమిళంలో మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు.

తెలుగు మరియు తమిళంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.అల్లు అరవింద్‌ మరియు ఠాగూర్‌ మధులు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube