వైసీపీలోకి ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?

ఏపీ టీడీపీలో మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు వైసీపీలో చేర‌తార‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సీఎం చంద్ర‌బాబుకు నివేదిక ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.రావెల వైసీపీలో చేరే ముందే ఆయ‌న‌పై వేటు వేసేందుకు టీడీపీ అధిష్టానం కూడా రెడీ అవుతోన్న‌ట్టు కూడా తెలుస్తోంది.

 Ap Tdp Mla To Join Ycp-TeluguStop.com

గ‌త ఎన్నిక‌ల్లో ల‌క్‌గా టిక్కెట్ కొట్టేసిన రావెల ఆ త‌ర్వాత అనూహ్యంగా మంత్రి అయ్యారు.మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌వ‌హార శైలీపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క్యాడ‌ర్‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డం ద‌గ్గ‌ర‌నుంచి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను గౌర‌వించ‌క‌పోవ‌డం, త‌న‌ను క‌ష్ట‌ప‌డి గెలిపించిన క్యాడ‌ర్‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం లాంటి ఎన్నో అంశాల్లో ఆయ‌న‌కు మైన‌స్ మార్కులు వ‌చ్చాయి.ఇక ఆయ‌న ఇద్ద‌రు కుమారులు మ‌హిళ‌ల విష‌యంలో అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయ్యింది.

రావెల తీరుపై అటు నియోజ‌క‌వ‌ర్గంలోను, ఇటు పార్టీలోను, స్టేట్ వైడ్‌గా జ‌నాల్లోను తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది.ఆయ‌న్ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌క‌పోతే ఆ ఎఫెక్ట్ గ‌ట్టిగా ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన చంద్ర‌బాబు ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌నకు ఊస్టింగ్ ఇచ్చారు.

మంత్రి పదవి ఊడిన తర్వాత రావెల తన నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో రావెల‌కు టీడీపీ టిక్కెట్ ద‌క్క‌డం కూడా క‌ష్ట‌మేన‌ని రావెల‌కు ముందే సిగ్న‌ల్స్ అంద‌డంతో ఆయ‌న వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసేకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.వైసీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు రావెల ప‌నులు చేసి పెడుతున్నార‌ట‌.

ఈ విష‌యం ఇంటిలిజెన్స్ వ‌ర్గాల ద్వారా చంద్ర‌బాబుకు నివేదిక అంద‌డంతో రావెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసేందుకు రెడీగా ఉంద‌ట‌.ఏదేమైనా రావెల వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినాయ‌క‌త్వంతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube