వైసీపీలోకి ఇద్ద‌రు ఏపీ మంత్రులు..!

ఏపీలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయా? ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఆయ‌న కేబినెట్‌లోనే గూడు పుఠాణీ జ‌రుగుతోందా? బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు ఆయ‌న న‌మ్మి నెత్తినెక్కించుకున్న వాళ్లే సిద్ధ‌మైపోయారా? విప‌క్షం వైకాపాతో చేతులు క‌లుపుతున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది.చంద్ర‌బాబు కేబినెట్‌లో అత్యంత కీల‌క శాఖ‌లు నిత్యం ప్ర‌జ‌ల‌తో సంబంధాలుండే శాఖ‌లు చూస్తున్న ఇద్ద‌రు మంత్రులు ఇప్పుడు బాబు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నార‌ట‌.

 Ap Ministers To Join Ycp-TeluguStop.com

బాబు లోగుట్లు అన్నింటినీ ఒక్కొక్క‌టిగా వైకాపా అధినేత జ‌గ‌న్‌కి అందించేస్తున్నార‌ట‌.ఈ ప‌రిణామం రాష్ట్రంలో పెను చ‌ర్చ‌కు దారి తీసింది.

వివ‌రాలు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు అవినీతిని స‌హించ‌న‌ని ప‌లు మార్లు చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కేబినెట్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల విష‌యంలో ఒకింత ఆల‌స్యంగానే స్పందించినా.ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు మంత్రుల‌కు మాత్రం బాగానే క్లాస్ ఇచ్చారు ఈ విష‌యం గ‌త ఏడాదే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

పైకి వివ‌రాలు తెలియ‌క‌పోయినా.స‌ద‌రు అవినీతి అమాత్యుల‌కు బాబు బాగానే క్లాస్ పీకార‌ని స‌మాచారం.

ఇలాగైతే.క‌ష్ట‌మేన‌ని తెగేసి చెప్పార‌ట‌.

అంతేకాదు, రేపో మాపో జ‌ర‌గ‌నున్న కేబినెట్ విస్త‌ర‌ణ‌లోనూ వారి సీట్ల‌ను క‌దిలించేసేందుకు బాబు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.

అయితే, ఆ ఇద్ద‌రు అమాత్యులు.

బాబు నుంచి నేర్చుకోవాల్సింది పోయి.త‌మ‌కే క్లాస్ పీకుతారా? అంటూ .అంత‌ర్గ‌తంగానే తిరుగు బావుటా ఎగ‌రేశార‌ని తెలుస్తోంది.వీరిలో ఒక‌రు కాక‌లు తీరిన మంత్రి కాగా, మ‌రొక‌రు కేంద్ర స‌ర్వీసుల నుంచి రిటైరై.

వ‌చ్చి తాజాగా సైకిలెక్కిన మంత్రి.వీరిద్ద‌రూ ఇప్పుడు జ‌గ‌న్‌కి చేరువుగా పావులు క‌దుపుతున్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే బాబుకు సంబంధించి లోగుట్లుగా ఉన్న రాజ‌ధాని ప్రాంత అవ‌క‌త‌వ‌క‌లు, పోల‌వ‌రం వివ‌రాలను వాళ్లు పూస‌గుచ్చిన‌ట్టు జ‌గ‌న్‌కి చేర‌వేశార‌ని తెలుస్తోంది.

అంతేకాకుండా, చంద్ర‌బాబు త‌మను మంత్రి వ‌ర్గం నుంచి తొలిగించిన అనంత‌రం జ‌గ‌న్ చెంత‌కు చేరుకునేందుకు కూడా వాళ్లు ప్లాట్ ఫాం రెడీ చేసుకున్నార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం పేర్లు గోప్యంగా ఉన్న‌ప్ప‌టికీ.మంత్రులు మాత్రం వేగంగానే పావులు క‌దిపార‌ని తెలుస్తోంది.

బాబుపై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని ఈ నేప‌థ్యంలో 2019లో ఆయ‌న రావ‌డం క‌ష్ట‌మ‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కూడా మ‌ద్ద‌తిచ్చే విష‌యం స‌స్పెన్సేన‌ని, కాబ‌ట్టి జ‌గ‌న్‌కి ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు ప‌డ‌తాయ‌ని ఊహిస్తున్న మంత్రులు టీడీపీ నుంచి బిచాణా ఎత్తేసి.వైకాపాలో పాగా వేసేందుకు య‌త్నిస్తున్నార‌ట‌.

ఇదీ.అవినీతి మంత్రుల ప‌రిస్థితి!! మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube