ఏపీలో ఆ మంత్రి శాఖ‌లో అవినీతి రాజ్యం

అవినీతిని స‌హించేది లేదు, భ‌రించేది అంత‌క‌న్నా లేదు అని ప‌దేప‌దే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌మానాలో మంత్రులు అవినీతి ఆట‌, పాట‌ల్లో మునిగి తేలుతున్నారు.మాన‌వ వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు, వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, గ‌నుల శాఖ మంత్రి పీత‌ల సుజాతల పేర్లు.

 Ap Minister Involved In Srikakulam Bridge Corruption-TeluguStop.com

పెద్ద ఎత్తున వినిపించ‌గా ఇప్పుడు రోడ్లు, భ‌వ‌నాల‌ శాఖ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు పేరు కూడా ఈ జాబితాలో చేరిపోయింది.ఈ శాఖ అవినీతి వ్య‌వ‌హారాల‌పై అధికారులు, ఉన్న‌తాధికారుల‌కు సంబంధించి నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద్ద ఎత్తున ఆరోప‌ణలు వ‌చ్చాయి.

అయితే, ఇప్పుడు నేరుగా మంత్రి రాఘ‌వ‌రావు పైనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న‌డం గ‌మ‌నార్హం.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో 65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు భ‌వ‌నాల శాఖ టెండ‌ర్లు పిలిచింది.

దీనికి 5 సంస్థ‌లు బిడ్లు దాఖ‌లు చేశాయి.ఈ బిడ్ల ఎంపిక‌లోనే అస‌లు అవినీతి అంతా జ‌రిగిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

బిడ్లు దాఖ‌లు చేసిన సంస్థ‌ల్లో కేవ‌లం బివిఎస్ఆర్, నాగభూషణం అండ్ కంపెనీనే అధికారులు ఎంపిక చేశారు.వాస్త‌వానికి ప్రభుత్వం కోట్ చేసిన ధ‌ర క‌న్నా త‌క్కువ‌కు ప‌నిచేసే కంపెనీని అధికారులు ఎంపిక చేయాలి.

కానీ, నాగ‌భూష‌ణం కంపెనీ 3% ఎక్కువ‌కే కోట్ చేసింది.అయినా కూడా దానినే ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ విష‌యంలో ఆర్ అండ్ బి ఈఎన్ సీ, కాంట్రాక్టు సంస్థ కూడ‌బ‌లుక్కున్నాయ‌ని, పెద్ద ఎత్తున డ‌బ్బులు చేతులు మారాయ‌ని తెలుస్తోంది.

అస‌లు బిడ్ దాఖ‌లు స‌మ‌యంలోనే విచిత్ర‌మైన నిబంధ‌న‌లు విధించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఈపీసీ పనుల్లో పాల్గొన్న వారు మాత్రమే పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు.ఇక్క‌డే ఏదో లోపాయికారీ విష‌యం ఉంద‌ని గ్ర‌హించిన కాంట్రాక్టు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

అయితే, అధికారులు తెలంగాణలో అమలు చేసిన ఓ మోడల్ ను చూపించి తప్పించుకున్నారు.ఇక‌, ఇప్పుడు నాగ‌భూష‌ణం కంపెనీ ఆ ప‌నుల‌ను ద‌క్కించుకోవ‌డం వెనుక అధికారుల‌తో పాటు మంత్రి శిద్దాకు కూడా పాత్ర ఉంద‌నే విష‌యం వెలుగు చూస్తోంది.

ఈ క్ర‌మంలోనే నాగ‌భూష‌ణం కంపెనీకి ప‌నులు అప్ప‌గించేలా తెర‌వెనుక మంత్రి చ‌క్రం తిప్పుతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఈ కంపెనీ బిడ్‌కు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వ‌ద్ద ఉంది.

ఆర్థిక శాఖ స‌ద‌రు కంపెనీ పెట్టిన బిడ్‌ను అంగీక‌రిస్తే.ప‌నులు ప్రారంభం అయిపోతాయి.

దీంతో మంత్రి త‌న‌దైన స్టైల్లో ఆ ఫైలును ఆర్థిక శాఖ అంగీక‌రించేలా ఒత్తిడి తెస్తున్నార‌ని స‌మాచారం.దీంతో ఆర్ అండ్ బీలో జ‌రుగుతున్న అవినీతి బాగోతంపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి.

వాస్త‌వ రేటు క‌న్నా 3% ఎక్కువ కోట్ చేసిన కంపెనీకి ఆ బిడ్‌ను ఎందుకు అప్ప‌గించాల్సి వ‌చ్చిందో అన్న అంశంపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తే.అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిజాయితీగ‌ల అధికారులు పేర్కొంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube