తెలంగాణ‌కు ఏపీ షాక్‌

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ, తెలంగాణ మ‌ధ్య ప‌లు అంశాల్లో ప‌రిష్క‌రించాల్సిన అంశాలు అలాగే ఉన్నాయి.ఉమ్మ‌డి ఆస్తుల విష‌యంలో ఈ రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య వార్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

 Ap Government’s Big Shock To Telangana-TeluguStop.com

ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు తాజాగా క‌రెంటు సాక్షిగా వీరి మ‌ధ్య మ‌రో వార్‌ మొద‌లైంది.ఏపీకి క‌రెంటు స‌ర‌ఫ‌రాకు సంబంధించి తెలంగాణ చెల్లించాల్సిన బ‌కాయిలు కొండ‌లా పేరుకుపోవ‌డంతో తెలంగాణ‌కు తాము మంగ‌ళ‌వారం నుంచి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తున్న‌ట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ తేల్చి చెప్పేసింది.

త‌మ‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు చెల్లించేవ‌ర‌కు తాము తెలంగాణ‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌లేమ‌ని కూడా ఏపీ తెలంగాణ ప్ర‌భుత్వానికి, తెలంగాణ విద్యుత్ సంస్థ‌ల‌కు రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేసింది.స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న చట్టం ప్ర‌కారం ఏపీలో ఉత్పత్తి అయ్యే థర్మల్‌ విద్యుతలో 53.89 శాతం తెలంగాణకు.తెలంగాణలో ఉత్పత్తయ్యే థర్మల్‌ విద్యుత్‌లో 46.11 శాతం ఏపీకి ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంది.

కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మ‌ధ్య క‌రెంటు స‌ర‌ఫ‌రాపై నెల‌వారీ బిల్లులు ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకుంటున్నా ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు రూ.4449 కోట్ల బ‌కాయి ఇవ్వాల్సి ఉంద‌ని ఏపీ ఆరోపిస్తోంది.అయితే తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న మ‌రోలా ఉంది.

క‌రెంటు బిల్లుల బ‌కాయిల‌కు, ఆస్తి హ‌క్కుల పంపిణీకి ముడిపెడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం, విద్యుత్ సంస్థ‌లు ఏపీకి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో పెట్టేస్తున్నాయి.

కరెంటు స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తామ‌న్న ఏపీ హెచ్చ‌రిక‌ల‌తో రూ.3149 కోట్లు తాము చెల్లించాల్సి ఉందని తెలంగాణ విద్యుత సంస్థలు లిఖితపూర్వకం గా అంగీకరించాయి.పెరిగిన ధరల కారణంగా ఏపీ 1300 కోట్లు పెంచి.5439 కోట్లుగా చూపుతోందని మ‌రో పేచీ పెట్టాయి.అయితే తెలంగాణ ప్ర‌భుత్వం, విద్యుత్ సంస్థ‌లు చేసిన ఈ వాద‌న‌ను ఏపీ ప్ర‌భుత్వం తప్పంటోంది.

ఏదేమైనా క‌రెంటు సాక్షిగా ఏపీ వ‌ర్సెస్ తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య మ‌రో ఆస‌క్తిక‌ర ఫైట్‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube