మహేష్ - పవన్..ఇద్దర్ని పట్టించుకోలేదు

మహేష్ బాబు కెరీర్ పెర్ఫామెన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెబుతారు బిజినెస్ మెన్ లో పండించిన గాంభీర్యాన్ని.ఈ సినిమాలో తన నటన అంటే మహేష్ కి కూడా బాగా ఇష్టం.

 Ap Government Ignores Mahesh And Pawan-TeluguStop.com

అందుకే అప్పట్లో మాటీవి వారు సిని”మా” అవార్డ్స్ లో తనని బిజినెస్ మెన్ కోసం ఉత్తమ నటుడు కేటాగిరిలో నామినేట్ చేయకపోవడంతో మహేష్ బాగా ఫీల్ అయ్యాడు.

ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ సీన్ గా చెబుతారు అత్తారింటికి క్లయిమాక్స్ ని.పవన్ ఏడిపించేసాడు అని అప్పట్లో రివ్యూలు తెగ రాసేసారు కూడా.కాని, ఈ ఇద్దరిని బేఖాతరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

సూపర్ స్టార్ – పవర్ స్టార్ అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లేసింది.

తెలంగాణ ఉద్యమం ఊపు వలన నంది అవార్డులు ఇవ్వడం మానేసిన ఏపి గవర్నమెంటు, తిరిగి నంది అవార్డులు మొదలుపెడుతోంది.2012 మరియు 2013 కి సంబంధించి నంది అవార్డుల విజేతలని ప్రకటించింది.

2012 సంవత్సరానికి హీరో నానిని (ఎటో వెళ్ళిపోయింది మనసు) ఉత్తమ నటుడిగా ఎంపిక చేయగా, 2013 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ప్రభాస్ (మిర్చి) ఎంపికయ్యాడు.దీంతో మహేష్ – పవన్ కి వ్యక్తిగతంగా ఏమి దక్కలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube