Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మహేష్ - పవన్..ఇద్దర్ని పట్టించుకోలేదు-AP Government Ignores Mahesh And Pawan

మహేష్ బాబు కెరీర్ పెర్ఫామెన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెబుతారు బిజినెస్ మెన్ లో పండించిన గాంభీర్యాన్ని. ఈ సినిమాలో తన నటన అంటే మహేష్ కి కూడా బాగా ఇష్టం. అందుకే అప్పట్లో మాటీవి వారు సిని”మా” అవార్డ్స్ లో తనని బిజినెస్ మెన్ కోసం ఉత్తమ నటుడు కేటాగిరిలో నామినేట్ చేయకపోవడంతో మహేష్ బాగా ఫీల్ అయ్యాడు.

ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ సీన్ గా చెబుతారు అత్తారింటికి క్లయిమాక్స్ ని. పవన్ ఏడిపించేసాడు అని అప్పట్లో రివ్యూలు తెగ రాసేసారు కూడా. కాని, ఈ ఇద్దరిని బేఖాతరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సూపర్ స్టార్ – పవర్ స్టార్ అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లేసింది.

తెలంగాణ ఉద్యమం ఊపు వలన నంది అవార్డులు ఇవ్వడం మానేసిన ఏపి గవర్నమెంటు, తిరిగి నంది అవార్డులు మొదలుపెడుతోంది. 2012 మరియు 2013 కి సంబంధించి నంది అవార్డుల విజేతలని ప్రకటించింది.

2012 సంవత్సరానికి హీరో నానిని (ఎటో వెళ్ళిపోయింది మనసు) ఉత్తమ నటుడిగా ఎంపిక చేయగా, 2013 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ప్రభాస్ (మిర్చి) ఎంపికయ్యాడు. దీంతో మహేష్ – పవన్ కి వ్యక్తిగతంగా ఏమి దక్కలేదు.

Continue Reading
More Posts
To Top