'మీ కోసం' పోర్టల్‌

ఐటీకి తానే ఆద్యుడినని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలక్ర్టానిక్‌ పరిపాలనపై అమితమైన ప్రేమ.ఇ-పాలన వల్ల పారదర్శకత (ట్రాన్‌్సపెరెన్సీ) ఉంటుందని, అవినీతి తగ్గుతుందని చెబుతుంటారు.

 Chandrababu Launches Meekosam.ap.gov.in-TeluguStop.com

అది ఎంతవరకు నిజమో తెలియదుగాని ప్ర స్తుతం ఆయన ప్రజాఫిర్యాదులు స్వీకరించేందు కోసం ‘మీ కోసం’ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించారు.ప్రజలు ఇప్పటివరకు తమ ఫిర్యాదులను ఆయా కార్యాలయాలకు వెళ్లి అధికారులకు అందచేస్తున్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు వారంలో ఓ రోజు కూడా ఇదివరకు కేటాయించారు.మరి ఇప్పుడు రాష్ర్టం విడిపోయాక ఏపీలో అమలు జరుగుతున్నదో లేదో తెలియదు.

తెలంగాణలో మాత్రం కొనసాగుతోంది.ఇక అసలు విషయానకొస్తే మీ కోసం పోర్టల్‌లో ప్రజలు తమ ఫిర్యాదులతోపాటు అందుకవరమైన డాక్యుమెంట్లు కూడా పెట్టొచ్చు.

కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా వివిధ విషయాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా ఇవ్వొచ్చు.అయితే ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేసేవారు తమ ఆధార్‌ నెంబర్‌ జత చేయాలట.

మరి అది లేనివారి ఫిర్యాదులు తీసుకోరా? ఫిర్యాదులకే కాకుండా సలహాలు ఇవ్వడానికి, ప్రభుత్వ పథకాలు, పనులు ఎలా జరుగుతున్నాయో తెలియచేయడానికి కూడా ఆధార్‌ నెంబర్‌ తెలియచేయాలట.ప్రజలు వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయగానే ‘మీ ఫిర్యాదు అందినది’ అని అధికారులు సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌ ఇస్తారు.

ఆ ఫిర్యాదు లేదా సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా అధికారులు ముందే చెప్పాలి.చెప్పిన సమయానికి పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేయాలి.ముందు అధికారుల్లో, ఉద్యోగుల్లో చిత్తశుద్ధి ఉండాలిగాని టెక్నాలజీ వాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయా?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube