తెలుగు ప్రేక్షకులు అంటే ఇంతే!

తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకుని సక్సెస్‌ కొట్టడంలో 100కు 90 శాతం మంది దర్శకులు విఫలం అవుతున్నారు.తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో అనే విషయాన్ని తెలుసుకుని అటువంటి సినిమాను తెరకెక్కించినా కూడా కొన్ని సమయాల్లో అది ఫ్లాప్‌ అవుతుంది.

 Audiance Showing Interest On Kumari 21f-TeluguStop.com

అలాంటివి ఎన్నో ఉన్నాయి.కొత్తగా ఏదైనా సినిమా చేస్తే అది కొన్ని సార్లు సక్సెస్‌ అవ్వడం జరుగుతుంది కొన్ని సార్లు తిప్పి కొట్టడం జరుగుతుంది.

కొత్త కథాంశం, స్క్రీన్‌ప్లేతో గతంలో వచ్చిన సినిమాల్లో కొన్నింటికి ఆధరించారు, మరి కొన్నింటిని తిప్పి కొట్టారు.తాజాగా వైవిధ్యభరిత కథాంశంతో వచ్చిన ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంకు ప్రేక్షకుల నుండి వస్తున్న ఆధరణ చూస్తుంటే ఆశ్చర్య కలుగుతోంది.

గత వారం అనుష్క నటించిన ‘సైజ్‌ జీరో’ మరియు ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రాలు విడుదల అయ్యాయి.ఈ రెండు చిత్రాల్లో సైజ్‌ జీరో చిత్రాన్ని కుమారి తట్టుకోగలదా అనే అనుమానాలు విడుదలకు ముందు వచ్చాయి.

కాని విడుదల తర్వాత కుమారి ముందు సైజ్‌ జీరో నిలువలేక పోయింది.ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన సైజ్‌ జీరోను ఆధరించని ప్రేక్షకులు పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేని, యాంటీ క్లైమాక్స్‌ ఉన్న కుమారిని విపరీతంగా ఆధరిస్తున్నారు.

సహజంగా తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్‌ను ఒప్పుకోరు.కాని ఈ సినిమా దాన్ని అదిగమించింది.

దర్శకుడు చూపించిన ప్రతిభ అనుకోవాలా లేక ప్రేక్షకులు మారారా అనే విషయం ఇక్కడ తెలియాల్సి ఉంది.

ప్రేక్షకులు మారారు అని మరేదైనా యాంటీ క్లైమాక్స్‌ సినిమా వస్తే దాన్ని ఆధరిస్తారు అనుకోవడం పొరపాటు అవుతుంది.

ఇటీవల విడుదలైన ‘కంచె’ చిత్రం పూర్తిగా యాంటీ క్లైమాక్స్‌, అయినా కూడా సినిమాను ఆధరించారు.ఇలా అన్నింటిని యాక్సెప్ట్‌ చేస్తారు అనుకుంటే పొరపాటు అవుతుంది.

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు, ఏ విషయాల ఆధారంగా సినిమాను సక్సెస్‌ చేస్తున్నారో అనే విషయంలో దర్శకులకు కూడా క్లారిటీ లేదు.ఏదైనా సినిమా సక్సెస్‌ అయినా లేక ఫ్లాప్‌ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఇంతే అని ఫిల్మ్‌ మేకర్స్‌ అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube