రుద్రమలో రొమాన్స్‌ ఎక్కువైందా?

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ప్రతిష్టాత్మకంగా స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ‘రుద్రమదేవి’.ఈ సినిమా కోసం దర్శకుడు గుణశేఖర్‌ ఏకంగా 70 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేసినట్లుగా ఇటీవలే స్వయంగా ఆయన చెప్పుకొచ్చాడు.

 Anushka’s Glamour Feast In Rudramadevi-TeluguStop.com

అనుష్క లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రానా మరియు అల్లు అర్జున్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు.పిరియాడిక్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుత ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు గుణశేఖర్‌ ఈ సినిమాకు మసాలా యాడ్‌ చేసినట్లుగా తాజాగా విడుదలైన పాటలను చూస్తుంటే అనిపిస్తోంది.

కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవిగా అనుష్క నటించింది.ఈ సినిమాలో అనుష్కను గ్లామరస్‌గా చూపించాడు.

పలు పాటల్లో అనుష్క అందాలు భారీగానే చూపించినట్లుగా కనిపిస్తోంది.ఇక అనుష్క, రానాల మద్య ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా గుణ ఈ సినిమాలో జొప్పించాడు.

పిరియాడికల్‌ సినిమాలో ఇలాంటి రొమాన్స్‌ ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనే విషయం చూడాలి.రొమాన్స్‌ ఒక మోస్తరు వరకు ఉంటే ఓకే కాని, శృతిమించిన రొమాన్స్‌ ఉంటే మాత్రం ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దర్శకుడు గుణశేఖర్‌ గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.

ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube