‘రుద్రమదేవి’లో ఆ సీన్స్‌ హైలైట్‌?

అనుష్క ముఖ్య పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 Anushka’s Fight Scenes Highlighted In Rudramadevi-TeluguStop.com

ఈ సినిమాలో అనుష్క పోషించిన పాత్ర సౌత్‌లో మరే హీరోయిన్‌ కూడా చేయలేదని దర్శకుడు గుణశేఖర్‌ పలు సార్లు చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాలో అనుష్క కొన్ని సీన్స్‌లో మగరాయుడుగా కనిపించింది.

ఆ సీన్స్‌ సినిమాకు హైలైట్‌ అవుతాయని, అనుష్క నటనకు అంతా మై మరచి పోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అనుష్క యుద్ద సన్నివేశాలతో పాటు, కొన్ని సంభాషణ సన్నివేశాల్లో మగాడి వేశదారణతో కనిపించనుంది.

ఆ సన్నివేశాల్లో అనుష్క నటించిన తీరు, ఆమె హావభావాలు కూడా అందరిని ఆశ్చర్య పర్చితీరుతాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో అనుష్కలోని మొత్తం ట్యాలెంట్‌ను చూస్తారని అంటున్నారు.

ఈ సినిమాకు అనుష్క పడ్డ కష్టం సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుందన్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్‌, రానాలు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube