అమ్మగా అనుష్క

వయస్సుకు తగ్గ పాత్రలు చేయడం కంటే, తమ వయస్సు కంటే ఎక్కువ వయస్సున్న పాత్రలు లేదా తక్కువ వయస్సున పాత్రలు చేసినప్పుడే నటీనటులు తమ సత్తాను చూపగలరు.అలాంటి పాత్రల్లో నటించి మెప్పించినప్పుడే వారి ట్యాలెంట్‌ బయటకు వస్తుంది.

 Anushka Will Be Appear As A Mother In Singham-3-TeluguStop.com

తాజాగా అనుష్క తన ట్యాలెంట్‌ను నిరూపించుకునే సాహసాలు చేస్తోంది.ఇప్పటికే ఈమె ‘బాహుబలి’లో ప్రభాస్‌కు తల్లిగా కనిపించబోతున్న విషయం తెల్సిందే.

‘బాహుబలి’లో దేవసేన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని అనుష్క చెబుతోంది.ఇక తాజాగా మరోసారి అనుష్క తల్లి పాత్రలో నటించేందుకు తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తమిళ స్టార్‌ హీరో ‘సింగం’, ‘సింగం`2’ సినిమాల్లో అనుష్క హీరోయిన్‌గా నటించింది.ఆ రెండు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి.

దాంతో తాజాగా ‘సింగం`3’ మూవీని తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే మూడవ పార్ట్‌ కోసం దర్శకుడు రెడీ చేసుకు వచ్చిన స్టోరీ లైన్‌కు సూర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అని, మొదటి రెండు పార్ట్‌ల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అనుష్క హీరోయిన్‌గా ఉంటుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో సూర్య, అనుష్కలకు ఇద్దరు పిల్లలు ఉంటారని చెబుతున్నారు.పిల్లల తల్లిదండ్రులుగా సూర్య, అనుష్కలు కనిపించబోతుండటంతో ఎలా ఉంటుందో ఈ మూడవ సింగం అని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube