స్వీటీ ఏం చేస్తావు?

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెళిగిన స్వీటీ అనుష్క సినిమాల వేగంను తగ్గించింది.గతంలో సంవత్సరంలో అయిదు నుండి ఎనిమిది సినిమాల వరకు చేసిన అనుష్క వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లు తగలడంతో సినిమాల సంఖ్యను సగం కంటే తక్కువకు తగ్గించింది.

 Anushka Shetty Not Getting Movie Offers-TeluguStop.com

ఈమె నటించిన తెలుగు సినిమాలు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన అనుష్క ప్రస్తుతం ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్‌ జీరో’ అనే సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగు, తమిళంకు కలిసి ‘సైజ్‌ జీరో’ సినిమా తప్ప మరే సినిమాను కూడా అనుష్క చేస్తున్నది లేదు.

హీరోల సరసన హీరోయిన్‌గా అనుష్క పేరును కూడా నిర్మాతలు, దర్శకులు పరిశీలిస్తున్నట్లుగా అనిపించడం లేదు.తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాను అంటూ చెప్పుకొస్తున్న అనుష్కకు ఆఫర్లే కరువు అయ్యాయి.

కెరీర్‌ చివరి దశలో హీరోయిన్‌ పాత్రల కోపం ఆరాటపడటం అత్యాసే అవుతుందని, అందుకే వచ్చిన ఆఫర్లను కాదనకుండా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మరియు ఇతర ముఖ్య పాత్రల్లో అయినా నటించాలని కొందరు సలహా ఇస్తున్నారు.మరి అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube