అనుష్క కి ఆ హీరోయిన్ కి క్షణం పడట్లేదు

బాలీవుడ్ లో బోర్ కొట్టిందో లేక హాలీవుడ్ మీద మోజు పడిందో కానీ దీపికా పడుకొనే మాత్రం హాలీవుడ్ వెళ్ళిపోవడానికి సిద్దం అయిపోతోంది.ప్రియాంకా టైపు లో సక్సెస్ లు సాధించాలి అని చూస్తున్న దీపిక ట్రిపుల్ ఎక్స్ సీరీస్ లోని కొత్త సినిమాలో నటిస్తోంది.

 Anushka Vs Deepika-TeluguStop.com

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళినపుడు తనకి ఎలా ఉంది అని మీడియా వర్గం అడగగా తనకీ అసలు తేడా లేదు అంటోంది ఈమె.” నా బేస్ అంతా బాలీవుడ్ అని నాకు తెలుసు, కెరీర్ చివర్లో బాలీవుడ్ యాక్టర్ గానే ఉండిపోతాను , నన్ను నా భారతదేశాన్నీ ఎవ్వరూ వేరు చెయ్యలేరు.సెలవులకి ఊరు వెళతాం కదా ఆ రకంగా హాలీవుడ్ వెళ్లాను అంతే.నేను ఎటు తిరిగి ఎటు వచ్చినా భారత్ చేరుకుంటాను.బాలీవుడ్ నటిగానే ఉండిపోతాను ” అన్నది దీపిక.కేవలం హాలీవుడ్ ఎలా ఉంది అన్నందుకు ఇంత క్లాస్ పీకుతుంది అని ఊహించని ఆ జర్నలిస్ట్ ఆశ్చర్యపోయాడు.

అదే ప్రశ్న అనుష్క శర్మ ని అడిగితే వింతగా సమాధానం చెబుతోంది.ఎక్కడికో వెళ్లిపోయి చేతికొచ్చిన ఇండియన్ గాళ్ కేరక్టర్లు చేయడం అంటే నాకిష్టం లేదు అని చెప్పింది.

అయితే.ప్రియాంక – దీపికలను తక్కువ చేయడం లేదని అనుష్క చెప్పినా.

దీపికా పదుకొనే మాత్రం బాగానే హర్ట్ అయినట్లుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube