అందాల తార అనుష్క అప్పుడే పెళ్లి చేసుకోదంట.మూడు పదుల వయసు దాటినా తన పెళ్లి మీద ఒక నిర్ణయానికి రాలేదట బొమ్మాలి.
అనుష్క తన పెళ్లిపై ఎలా స్పందించిందో తన మాటల్లోనే …
” నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే ఇంకా తెలియదు.నాకు ఇపుడప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు.
నేనేది తొందరగా ప్లాన్ చేయలేను.ఇక పెళ్లి అనేది కూడా నా చేతిలో లేదు.
నా ధ్యాసంతా ప్రస్తుతానికి సినిమాల మీదే ఉంది.నేనేమి ఖాలిగా లేను.
ప్రేమించి వివాహం చేసుకుంటానా లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానా అనేది అప్రస్తుతం.వివాహం గురించే ఇంకా ఆలోచించనప్పుడు , ఎలా చేసుకుంటాను అనేది ఎట్లా అలోచిస్తాను ” అని అనేసింది అనుష్క.
బొమ్మాలి నటించిన సైజ్ జీరో ఈ నెల 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఆ చిత్రం కోసం పెంచిన బరువుని “బాహుబలి-2” కోసం తరిగించే పనిలో బిజీగా ఉంది అనుష్క.
బాహుబలి రెండో భాగం యొక్క షూటింగ్ డిసెంబర్ రెండొవ వారం నుంచి కొనసాగుతుంది.