అనుష్క కర్ణాటకలో పుట్టి పెరిగింది.కన్నడ జనాలకి తెలుగు ఎంతో కొంత వచ్చు .
కాని మరీ బూతులు మాట్లాడగిలిగే తెలుగు మాత్రం రాదు .
అవి అరుంధతి షూటింగ్ జరిగే రోజులు.అప్పటికి అనుష్క కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.తెలుగు అంతంత మాత్రమే వచ్చు అనుష్క కి.డైలాగ్స్ బట్టి పట్టడం, చుట్టపక్కల వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే గమనించటం చేసేదంటా అనుష్క … అయితే అప్పుడప్పుడు షూటింగ్ ఒత్తిడి వల్ల, పనులు సరిగా జరగకపోయినా, చిన్న కార్మికులని కాస్తా గట్టిగా తిట్టేవారంటా నిర్మాత శ్యాం ప్రసాద్ … అందులో బూతులు కుడా ఉండేవంటా !
ఆ మాటలకి అర్థం ఏమిటని అడిగితే నవ్వేసేవారంటా ప్రొడ్యుసర్ శ్యాం ప్రసాద్ .“అరుంధతి ఓ తీపి గురుతు .నా కెరీర్ ని మార్చివేసిన సినిమా .నా కెరీర్ రెండు భాగాలుగా విభజిస్తే , అరుంధతి కి ముందు, అరుంధతి తర్వాత అని చెప్పొచ్చు .అంతలా నా మీద ప్రభావం చూపింది ఆ సినిమా.ఇప్పుడు మాత్రం తెలుగు పూర్తిగా అర్థమవుతుందని, ఆ బూతులు కుడా అర్థమవుతాయని ” చెప్పుకొచ్చింది అనుష్క.