చిరంజీవిని కాదన్న అనుష్క

మెగాస్టార్ చిరంజీవి 150వ ప్రాజెక్టులో మరో ట్విస్ట్‌ వచ్చిపడింది.ఇప్పటికే చాలా ఆలస్యం జరగగా, ఇప్పుడు మరికొన్ని రోజులు సినిమా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

 Anushka Is Not A Part Of Chiranjeevi 150th-TeluguStop.com

అందుకు కారణం హీరోయిన్ దొరక్కపోవడమే.అవును మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరకట్లేదు.

నయనతార, తమన్నా, ఇంకో నాలుగైదు పేర్లు చెప్పి, చివరకి అనుష్క ఫిక్స్ అయిపోయిందని అన్నారు.బొమ్మాలి బాస్ తో జతకడుతోందని పండగ చేసుకున్నంత పనిచేశారు అభిమానులు.

అయితే ఇప్పుడు అనుష్క కూడా ఈ సినిమా చేయట్లేదని వార్తలు వస్తున్నాయి.

అవును, అనుష్క దగ్గర డేట్స్ లేవు.

బాహుబలి రెండొవభాగం షూటింగ్ కోసం విపరీతంగా కష్టపడుతోంది అనుష్క.ఈ సినిమాతోపాటు భాగమతి కూడా పూర్తి చెయ్యాలి.

ఇంత ఇరుకైన షెడ్యూలు పెట్టుకోని, డేట్స్ ఎలా సర్దుబాటు చేయను అని అనేసిందట అనుష్క.

ఇక చేసేదేముంది.

దర్శకుడు వివి వినాయక్ మరో హీరోయిన్ ని వెతుక్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube