అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ వెనుక పరిగేడుతోందో లేక సక్సేసే అనుపమ వెంట పరిగెడుతోందో అర్థం కావడం లేదు.ఒకటి రెండు హిట్లు రాగానే హీరోయిన్లని గోల్డెన్ లెగ్ అని పిలుస్తారు.
మరి అనుపమ వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ రుచి చూసింది.తీసిందే ఏడు చిత్రాలైతే అందులో ఒక్క అపజయం లేదు.
మరి అనుపమని డైమండ్ లెగ్ అని అనాలా?
తాజా విషయాలు మాట్లాడుకుంటే, జనవరిలో అనుపమ సినిమాలు రెండు విడుదల అయ్యాయి.అందులో శర్వానంద్ సరసన చేసిన శతమానం భవతి అసలు ఎవరు ఊహించని సక్సెస్ ని సొంతం చేసుకుంటే, మలయాళంలో డాల్కర్ సల్మాన్ తో చేసిన “జోమొంటే సువిసేశానగల్” అనే చిత్రం కూడా మంచి కలేక్ష్హన్లు రాబడుతూ విజయపథంలో దూసుకుపోతోందట.
ఇక గత ఏడాది అఆ, ప్రేమమ్ చిత్రాలతో తెలుగులో బంపర్ సక్సెస్ అందుకున్న ఈ మళయాళ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సరసన నటించే పెద్ద అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే.అదృష్టం ఇప్పటిదాకైతే అనుపమని అంటిపెట్టుకొనే ఉండి.
మరి పెద్ద హీరోయిన్ గా ఎదుగుతున్న దశ కదా ఇది .ఇప్పటినుంచి ఆట ఎలా ఆడుతుంది అనేదే ముఖ్యం.