చర్మం యవ్వనంగా ఉండటానికి ఉత్తమమైన యాంటీ-ఏజింగ్ నూనెలు

వయస్సు పెరుగుతున్నప్పుడు చర్మంలో నూనెల ఉత్పత్తి తగ్గుతుంది.అలాంటప్పుడు చర్మం సాగటం,లైన్స్ ఏర్పడటం మరియు ముడతలు రావటం జరుగుతుంది.

 Anti-aging Oils For Beautiful Skin-TeluguStop.com

కానీ కొంచెం శ్రద్ద పెడితే చర్మాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా యవ్వనంగా మార్చవచ్చు.చర్మం మృదువుగా మరియు తేమగా ఉండాలంటే తగినంత నూనెలు అవసరం.అందుకే ఇప్పుడు అటువంటి యాంటీ-ఏజింగ్ నూనెల గురించి తెలుసుకుందాం.

1.అర్గన్ నూనె
ఈ నూనెను మొరాకో చెట్టు నుండి సేకరిస్తారు.ఈ నూనెలో ఉండే 80 శాతం కొవ్వు ఆమ్లాలు యాంటీ-ఏజింగ్ ప్రయోజనాలను అందించటానికి మరియు స్వేచ్ఛారాశుల మీద పోరాటం చేయటానికి సహాయపడతాయి.

ఈ నూనెలో విటమిన్లు ఎ,ఇ సమృద్దిగా ఉండుట వలన ముడతలు,వయస్సు మచ్చలు,సాగిన చర్మం,లైన్స్ తగ్గించటానికి మరియు చర్మాన్ని తేమగా ఉంచటానికి, చర్మ స్థితిస్థాపకత పెంచటం, అతినీలలోహిత (UV) కిరణాల వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.ఈ నూనె చర్మంలో బాగా కలిసిపోతుంది.

అంతేకాక అన్ని రకాల చర్మాల వారికీ అనుకూలంగా ఉంటుంది

రాత్రి పడుకొనే ముందు కొన్ని చుక్కల అర్గన్ నూనెను తీసుకోని ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.అలాగే రోజువారీ ఆహారంలో ఒక స్పూన్ అర్గన్ నూనెను జోడించవచ్చు.

2.ఆలివ్ నూనె
ఆలివ్ నూనె చర్మాన్ని యవన్నంగా ఉంచటానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.

ఈ నూనెలో విటమిన్ ఏ,ఇ, ఖనిజాలు మరియు కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.ఆలివ్ నూనెను చర్మం మీద రాసినప్పుడు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మాన్ని మృదువుగా మరియు యవన్నంగా ఉంచుతుంది.

ఆలివ్ నూనెను అంతర్గతంగా తీసుకున్నప్పుడు అల్జీమర్స్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది

ప్రతి రోజు స్నానానికి ముందు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్తో 5 నుంచి 10 నిముషాలు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, వృద్దాప్య లక్షణాలు తగ్గటానికి మరియు చర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడుతుంది.అలాగే ప్రతి రోజు ఆహారంలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని జోడించాలి.

3.కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు,వయస్సు మచ్చలు మరియు వృద్ధాప్య చిహ్నాలను అడ్డుకుంటుంది.

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు స్వేచ్ఛారాశుల మీద పోరాడటానికి సహాయం మరియు దెబ్బతిన్న కణాలను పోషించటానికి సహాయపడతాయి.అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల మీద పోరాటం చేస్తాయి.

అంతేకాకుండా దీర్ఘకాలిక పొడి చర్మం, తామర మరియు సోరియాసిస్ వంటి వాటి చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు

ప్రతి రోజు స్నానం తర్వాత కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.గ్రాన్యులేటెడ్ చక్కెర తో కొబ్బరి నూనెను కలిపి వారానికి ఒకసారి స్క్రబ్ గా ఉపయోగించాలి.

అలాగే ప్రతి రోజు ఆహారంలో 2 స్పూన్ల కొబ్బరి నూనెను జోడించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube