వైసీపీ కోసం మ‌రో కొత్త ఛానెల్‌

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది.మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది.

 Another News Channel For Ysrcp-TeluguStop.com

వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు.మ‌న తెలుగులో రాజ‌కీయ పార్టీల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థ‌లు చాలానే ఉన్నాయి.

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా న‌మ‌స్తే తెలంగాణ‌, టీ న్యూస్ ఉన్నాయి.సీపీఎంకు ప్ర‌జాశ‌క్తి, న‌వ తెలంగాణ‌, 10 టీవీ ఉన్నాయి.

సీపీఐకు విశాలాంధ్ర‌, 99 న్యూస్ ఉన్నాయి.

ఇక ఏపీలో అధికార టీడీపీకి కొమ్మ‌కాసే మీడియా సంస్థ‌ల‌కు లెక్కేలేదు.

ఈ లిస్టులో చాలానే ఉన్నాయి.ఇక ఏపీలో విప‌క్ష వైసీపీకి సొంతంగా సాక్షి పేప‌ర్‌, సాక్షి టీవీ ఛానెల్ ఉన్నాయి.

సాక్షి మీడియా సంస్థ‌ల్లో జ‌గ‌న్‌కు, వైసీపీకి అనుకూలంగా ప‌దే ప‌దే క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌వుతుంటాయి.ఇక్క‌డ ప్ర‌జాప‌క్షం క‌న్నా, జ‌గ‌న్ ప‌క్షం, వైసీపీ ప‌క్ష‌మే క‌న‌ప‌డుతుంటుంది.

ఏపీలో వైసీపీ క‌న్నా, టీడీపీ మీడియానే ఎక్కువుగా డామినేష‌న్ చేస్తుంటుంది.ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మ‌రో ఛానెల్ రానుంద‌ని ఏపీ మీడియా వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

వైసీపీతో సన్నిహిత రాజకీయ సంబంధాలు వున్న ఓ ఎన్నారై ఈ ఛానెల్ పెట్టే ఏర్పాట్ల‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

స‌ద‌రు ఎన్నారై 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌తోనే ఈ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఛానెల్ ద్వారా వైసీపీ కార్య‌క్ర‌మాల‌ను బాగా హైలెట్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు స‌మాచారం.ఈ ఛానెల్ ఏర్పాటుకు సంబంధించిన వ‌ర్క్ అంతా ఇప్పుడు శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇక ఏపీ కేంద్రంగా ఏపీ టైమ్స్ ఛానెల్ త్వ‌ర‌ల‌నే లాంచ్ కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube