తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌..!

తెలంగాణ‌లో ఏ ఎన్నిక జ‌రిగినా గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దే.2014 ఎన్నిక‌ల త‌ర్వాత మెద‌క్ – వ‌రంగ‌ల్ లోక్‌సభ స్థానాల‌తో పాటు ఖేడ్‌, పాలేరు అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యం సాధించింది.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సైతం టీఆర్ఎస్ వ‌న్‌సైడ్ విజ‌యం సాధించింది.ఇలా తెలంగాణ‌లో ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దే.

 Another By Election In Telangana-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ తీసుకుకే ఓ తాజా డెసిష‌న్‌తో తెలంగాణ‌లో మ‌రో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుందా ? అంటే టీ పాలిటిక్స్‌లో అవున‌నే ఆన్స‌ర్ వినిపిస్తోంది.కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి ఎప్ప‌టి నుంచో ఓ కోరిక ఉంది.

తెలంగాణ‌కు మంత్రిగా ప‌నిచేయాల‌న్న‌దే ఆయ‌న కోరిక‌.

గుత్తా ఈ విష‌యంలో కేసీఆర్‌పై ఎప్ప‌టి నుంచో ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే గుత్తాను శాస‌న‌మండ‌లికి పంపి…వ‌చ్చే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు ఏదో ఒక శాఖ అప్ప‌గించాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.అదే జ‌రిగితే ఆయ‌న న‌ల్గొండ ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అప్పుడు అక్క‌డ టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

న‌ల్గొండ జిల్లాలో గుత్తా ఎంపీగా ఉన్న న‌ల్గొండ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి – ఆయన సతీమణి పద్మావతి – ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి – కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఉన్నారు.దీంతో అక్క‌డ గెలిస్తేనే త‌మ స‌త్తా ఏంటో తెలుస్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.ఇక వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల త‌ర్వాత గుత్తాతో కేసీఆర్ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించి.

ఆ త‌ర్వాత ఉప ఎన్నిక‌కు వెళ‌తార‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube