అన్నదమ్ములకు గానీ, అక్కచెల్లెళ్లకు గాని ఒకేసారి పెళ్లి చేయవచ్చా?

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దవారు అనటం తరచుగా వింటూ ఉంటాం.పెళ్లి అనేది ఇటు స్త్రీ జీవితాన్ని … అటు పురుషుడి జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రభావితం చేస్తూ వుంటుంది.

 Anna Dammulu Mariyu Akkachelllaku Oke Sari Pelli Cheyavachha-TeluguStop.com

పెళ్లి అనే ఈ పవిత్రమైన కార్యం వెనుక వధూ వరులిద్దరే కాదు, రెండు కుటుంబాలు … రెండు వంశాలు కనిపిస్తాయి.పెళ్లి విషయంలో ఏ వైపు నుంచి ఎలాంటి తేడా వచ్చినా, ఆ ప్రభావం కొన్ని తరాలపై పడుతుంది

ఈ కారణంగానే పెళ్లి విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఒక్కోసారి ఒకే ఇంట్లో అన్నదమ్ములకు గానీ, అక్కచెల్లెళ్లకు గాని వెంటవెంటనే సంబంధాలు కుదిరిపోతుంటాయి.అయితే సంతానంలో పెద్దవారిగా వున్న అబ్బాయికైనా … అమ్మాయికైనా పెళ్లైపోతే, ఏడాదిలోపు రెండోవారికి పెళ్లిచేయకూడదనే నియమం మన సంప్రదాయంలో కనిపిస్తూ వుంటుంది.

దాంతో ఒకే ఏడాదిలో ఉగాదికి ముందు ఒకరి వివాహం … ఆ తరువాత రెండోవారి వివాహం జరుపుతుంటారు.ఉగాదికి ముందు ఒక సంవత్సరంగా … ఆ తరువాత వచ్చింది మరో సంవత్సరంగా భావిస్తూ వుండటం వలన ఈ విధమైన నిర్ణయాలు జరుగుతూ వుంటాయి.

ఈ విధంగా ఒకే ఏడాదిలో ఉగాదికి ముందు … ఆ తరువాత అంటూ ఒకే ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిపించడం శాస్త్రం దోషంగా పేర్కొంటుంది

సాధారణంగా వివాహ వేడుకకు పితృదేవతలను కూడా ఆహ్వానించడం జరుగుతూ వుంటుంది.మనకు ఒక సంవత్సర కాలం గడిస్తే, పితృదేవతలకు ఒక రోజు మాత్రమే గడుస్తుంది.

అందువలన 12 మాసాలు గడిచిన తరువాతే మరో పెళ్లి జరిపించాలి.లేదంటే ఒకే రోజున పితృదేవతలను రెండు పెళ్లిళ్లకు పిలిచినట్టు అవుతుంది.

ఇలాంటి ఆహ్వానాన్ని వాళ్లు హర్షించరు గనుక, వివాహ కాలానికి సంబంధించిన విషయంలో ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube