తెలుగమ్మాయి అంజలి కోలీవుడ్‌లో వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ పాపులర్ అయ్యింది.ఈఅమ్మడు తమిళంలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.మరో వైపు ఈమె తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
ఇటీవలే ఈమెకు నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’లో నటించే అవకాశం వచ్చింది.అది అలా ఉండగానే తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఈమె హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.
తమిళంలో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన ‘పిజ్జా’ సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి సరసన అంజలి హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.‘పిజ్జా’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
‘పిజ్జా’ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.అటువంటి క్రేజ్ ఉన్న సినిమాలో అంజలి హీరోయిన్‌గా ఎంపిక అవ్వడంతో ఆమె కెరీర్‌కు ఇది తప్పకుండా టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు.
నటనకు ఆస్కారమున్న పాత్రలో ఈ అమ్మడు నటించబోతుంది.