అనుష్క కాదు అంజలి

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయాపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు.ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రలో కేథరిన్ కనిపించనుంది.

 Anjali To Dance In Item Number For Allu Arjun-TeluguStop.com

అయితే ఐటెం సాంగ్ కోసమని అనుష్కని సంప్రదించారని, ఇందులో ఉండే ఆ హాట్ హాట్ సాంగ్ కి అల్లు అర్జున్ తో అనుష్క స్టెప్స్ వేస్తుందని వార్తలు వచ్చాయి.

ఒక గుప్త వార్తదాత మాట్లాడుతూ ” ఐటెం సాంగ్ కోసమని అసలు అనుష్క ని ఎవరు సంప్రదించలేదు.

ఈ వదంతు మీడియాలో ఎలా వచ్చిందో తెలియదు.ఇందులో అనుష్క ఎలాంటి పాత్రలో కనిపించదు.

స్పెషల్ సాంగ్ కోసమని ప్రస్తుతం అంజలితో చర్చలు జరుగుతున్నాయి.అన్ని అనుకున్నట్టే జరిగితే అంజలి ఐటెం సాంగ్ లో మెరుస్తుంది.

శంకరాభరణంలో అంజలి రశేష్ చూసిన యూనిట్, ఈ సాంగ్ అంజలి అయితే బాగుంటుందని భావిస్తోంది” అంటూ వార్తను ఇటు చేరివేసారు.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

డిసెంబర్ ఆఖర్లో లేదా జనవరి మాసంలో షూటింగ్ మొత్తం పూర్తీ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube