అంజలి చెల్లి గర్బవతి

‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న ముద్దుగుమ్మ అంజలి.తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

 Anjali Sister Aaradhya To Become Mother-TeluguStop.com

ప్రస్తుతం ఇక్కడ అక్కడ కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తోంది.వరుస సినిమాలతో దూసుకు పోతున్న ఈ అమ్మడు సోదరి ఆరాద్య కూడా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా ఆ వార్తలపై అంజలి క్లారిటీ ఇచ్చింది.

తన చెల్లి ఆరాధ్య తెలుగు సినిమాల్లో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను ప్రస్తుతం గర్బంతో ఉందని ఇలాంటి వార్తలు నమ్మవద్దంటూ అంజలి అధికారికంగా ప్రకటించింది.

వచ్చే సంవత్సరంలో ఆరాధ్య పాపకు జన్మనివ్వబోతున్నట్లుగా అంజలి చెప్పుకొచ్చింది.అంజలి సోదరి ఆరాధ్య ఆ మధ్య కొన్ని ఫొటో షూట్‌లు చేయించుకుంది.

దాంతో ఆరాధ్య కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే తాజాగా అంజలి క్లారిటీ ఇవ్వడంతో ఆరాద్య ఎంట్రీపై ఇప్పటి వరకు వస్తున్న పుకార్లకు బ్రేక్‌ పడ్డట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube