Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చిత్రాంగద మూవీ రివ్యూ -Chitrangada Movie Review

చిత్రం : చిత్రాంగద

బ్యానర్ : క్రియేటివ్ డ్రావిడన్స్

దర్శకత్వం : అశోక్ జి

నిర్మాతలు : రెహమాన్ – గంగపట్నం శ్రీధర్

సంగీతం : సెల్వా – స్వామి

విడుదల తేది : మార్చి 10, 2017

నటీ-నటులు – అంజలి, సింధు తులాని, సాక్షి గులాటి తదితరులు

గీతాంజలి లాంటి హర్రర్ కామెడితో మంచి హిట్ ని అందుకుంది అంజలి. కాని ఆ సినిమా తరువాత వచ్చిన ఫీమేల్ ఓరియెంటెడ్ హర్రర్ చిత్రాలేవి సక్సెస్ ని రుచి చూడలేదు. మరి అదే కోవలో వచ్చిన చిత్రాంగద గీతాంజలి లాంటి విజయాన్ని సాధించేలా ఉందా లేదా రివ్యూలో చూద్దాం.

కథలోకి వెళితే :

అనాథ అయిన చిత్ర (అంజలి) వైజాగ్ లో ఒక హాస్టల్ లో ఉంటూ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటుంది. ఆ హాస్టల్ లో దెయ్యాలున్నాయని అప్పటికే టాక్ ఉండగా, కొన్ని అనుమానస్పద సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఆ తరువాత బయటపడే విషయం ఏమింటంటే, ఈ సంఘటనల వెనుక ఉన్నది ఎవరకి కాదు, చిత్రనే. హాస్టల్ లో అమ్మాయిల పట్ల చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక్కోసారి భయపెడుతుంది, ఒక్కోసారి లైంగికంగా దాడి చేస్తుంది. దాంతో చిత్ర మీద లెస్బియన్ అనే ముద్రతో పాటు పిచ్చిది అనే ముద్ర కూడా పడుతుంది.

చిత్ర ఇలా ప్రవర్తించడానికి కారణం తనకి నిద్రలో వచ్చే ఓ కల. ఆ కలలో ఎవరో మగవాడిని ఒక మహిళ అమెరికాలోని ఓ లేక్ దగ్గర మర్డర్ చేసినట్లుగా కనిపిస్తు ఉంటుంది. ఆ కలకి, తనకి సంబంధం ఏమిటి ? తను అమ్మాయిల పట్ల ఆకర్షితురాలు అవడానికి కారణం ఏమిటి ? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ చిత్ర అమెరికా వెళుతుంది. మరి చిత్రకి సమాధానాలు దొరికాయా లేదా తెరమీదే చూడండి.

నటీనటుల నటన :

అంజలి ఆకట్టుకోలేదు. నటనపరంగా కాని, లుక్స్ పరంగా కాని, అంజలి ఆకట్టుకోలేపోయింది. బేసిగ్ గా తను మంచి నటి, కాను దర్శకుడి టేకింగ్ సరిగా లేక అంజలి తన మార్క్ చూపించలేకపోయింది. మిగితా నటుల్లో సాక్షి గులాటికి ఓ ముఖ్యమైన పాత్ర దొరకగా, తను లిప్ సింక్ లేక, ఏ భావానికి ఏ హావభావాలు పెట్టాలో తెలీక సీన్లను పెంట పెంట చేసింది. జయప్రకాశ్ పాత్ర కూడా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఈ సినిమాలో ఎవరి పాత్ర కూడా స్థిరంగా లేదు. సప్తగిరి కామెడి విసుగు పుట్టిస్తుంది. అందరిలోకి సింధు తులాని పాత్ర, నటన, రెండూ గుడ్డి మీద మెల్ల నయం అన్నట్లుగా.

టెక్నికల్ టీమ్ :

టెక్నికల్ టీమ్ లో పెద్ద పేర్లు ఉన్నాయి. కాని ఈ సినిమాకి వాళ్ళేనా పనిచేసింది? నమ్మడం కష్టం. సినిమాటోగ్రాఫి ఒకరే చేసారా అని డౌటు. కొన్ని షాట్స్ బాగున్నాయి అన్నట్టు అనిపిస్తాయి, మరికొన్ని ఎదో లో బడ్జెట్ షార్ట్ ఫిలింని తలపిస్తాయి. ఎడిటింగ్ చాలా దారుణంగా ఉంది. సీన్ల అమరిక ఏమాత్రం బాగాలేదు. అసలు ఎడిటింగ్ బేసిక్స్ లేనివారు చేసినట్టు జెర్క్ ఉంటాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చైల్డిష్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగాలేవు.

విశ్లేషణ :

ఈ సినిమా స్క్రీన్ ప్లే కాపి ఒకటి తీసుకెళ్లి ఏదైనా ఫిలిం మేకింగ్ కోర్సులో “స్క్రీన్ ప్లే” ఎలా రాసుకోకూడదు అనే టాపిక్ మీద వాడుకోవచ్చు. అసలు ఈ సినిమాకి దర్శకత్వం వహించింది నిజంగానే పిల్ల జమీందార్ సినిమా తీసిన అశోకేనా లేక, ఆయన సినిమా వదిలేసి వెళ్ళిపోతే నిర్మాతలే కెమేరా, యాక్షన్ అంటూ సినిమా తీసేసుకున్నారా అని అనుమానం. ఒక్కోసారి సీన్ సీన్ కి సంబంధం ఉండదు. బాధకరమైన విషయం ఏమిటంటే, ఈ కథను మొదటిసారి షార్ట్ ఫిలిం తీయాలనుకునే యువకుడికి ఇచ్చినా, ఇంతకన్నా బాగా తీస్తాడు.

అంజలి క్యారక్టరైజేషన్ లో క్లారిటి లేదు. స్క్రీన్ ప్లేలో పట్టు లేదు, నటులకి లిప్ సింక్ లేదు. దెయ్యం సీన్లలో భయం లేదు .. మొత్తంగా సినిమాలో విషయం లేదు.

ప్లస్ పాయింట్స్ :

* ఏమి లేవు

నెగెటివ్ పాయింట్స్ :

* సినిమా మొత్తం

చివరగా :

చిత్రాంగద – ఓ చిత్రహింస

తెలుగుస్టాప్ రేటింగ్ :1/5

Continue Reading

More in Featured

 • REVIEWS

  katamarayudu Movie Review

  By

  టైటిల్ : కాట‌మ‌రాయుడు జానర్ : ఫ‌్యామిలీ అండ్ యాక్ష‌న్ మూవీ తారాగణం : ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శృతీహాస‌న్‌, నాజ‌ర్‌, ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌,...

 • REVIEWS

  Chitrangada Movie Review

  By

  చిత్రం : చిత్రాంగద బ్యానర్ : క్రియేటివ్ డ్రావిడన్స్ దర్శకత్వం : అశోక్ జి నిర్మాతలు : రెహమాన్ – గంగపట్నం...

 • REVIEWS

  Dwaraka Movie Review

  By

  చిత్రం : ద్వారక బ్యానర్ : లెజెండ్ సినిమా దర్శకత్వం : శ్రీనివాస రవీంద్ర నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్...

 • REVIEWS

  Kittu Unnadu Jagratha Movie Review

  By

  చిత్రం : కిట్టు ఉన్నాడు జాగ్రత్త బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ దర్శకత్వం : వంశీకృష్ణ నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర,...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..