రామ్‌చరణ్‌ కొలవెరిడీ..!

వై దిస్‌ కొలవెరిడీ.సాంగ్‌తో యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఎంతటి ప్రాచుర్యం సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Anirudh’s Music To Ram Charan’s Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈయన తమిళనాట మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒక్కడు.ఈయన తమ సినిమాలకు సంగీతాన్ని అందించాలని యువ హీరోలు కోరుకుంటున్నారు.

ఇటీవల వచ్చిన యువ హీరోల దాదాపు అన్ని సినిమాలకు కూడా అనిరుధ్‌ సంగీతాన్ని అందించాడు.ఈయన కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌ సినిమాలు ఉన్నాయి.

దాంతో ఈ సంగీత దర్శకుడిని తెలుగులోకి తీసుకు రావాలని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కోరుకుంటున్నాడు.

రామ్‌చరణ్‌ త్వరలో నటించబోతున్న ‘నా పేరే రాజు’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నట్లుగా అధికారిక సమాచారం అందుతోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నాడు.కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌లు చరణ్‌ ఇమేజ్‌కు సూట్‌ అయ్యేలా ఒక పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మాస్‌ మసాల స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.

కామెడీతో పాటు యాక్షన్‌ కూడా సమ పాల్లలో ఉండేలా వీరు ప్లాన్‌ చేస్తున్నారు.ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube