బన్నీ కోసం ‘పటాస్‌’

సక్సెస్‌ సినిమాల దర్శకుల వెంట పడటం తెలుగు నిర్మాతలకు కొత్త కాదు.ఒక కొత్త దర్శకుడు సక్సెస్‌ కొడితే తప్పకుండా ఆయన వెంట నిర్మాతలు పడుతారు.

 Anil Ravipudi To Directs Allu Arjun..?-TeluguStop.com

అదే బ్లాక్‌ బస్టర్‌ కొడితే ఇక ఆ దర్శకుడి రాతే మారిపోయినట్లే.ప్రస్తుతం దర్శకుడు అనీల్‌ రావిపూడి పరిస్థితి కూడా అంతే ఉంది.

ఇటీవలే ఈయన నందమూరి కళ్యాణ్‌ రామ్‌కు ‘పటాస్‌’తో సక్సెస్‌ను ఇచ్చాడు.ఆ సినిమా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ దర్శకుడిపై ఉంది.

అయితే ఇప్పటికే ఈ దర్శకుడిని దిల్‌రాజు బుక్‌ చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

దిల్‌రాజు మరియు అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సి ఉంది.

ఆ సినిమాకు ఈ దర్శకుడు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని అంటున్నారు.ప్రస్తుతం దిల్‌రాజు ఆ సన్నాహాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అనీల్‌ రావిపూడితో అల్లు అర్జున్‌ కోసం ఒక మంచి కమర్షియల్‌ స్క్రిప్ట్‌ను రాయించే పనిలో దిల్‌రాజు ఉన్నాడని మెగా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.మరో వైపు అనీల్‌ రావిపూడి మరో సినిమాను నందమూరి హీరోతో చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

మొత్తానికి ఈ దర్శకుడితో తమ హీరో సినిమా చేయాలని నందమూరి మరియు మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.మరి మొదట ఏ హీరోతో ఈ దర్శకుడు సినిమా చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube